Swetha
IMDB Top 10 Web Series: ప్రతి వారం ఓటీటీలో పదుల కొద్దీ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే, వీటిలో అత్యధిక రేటింగ్ ఉన్న వెబ్ సిరీస్ లు ఏవో, అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో .. వాటి వివరాలు తెలుసుకుందాం.
IMDB Top 10 Web Series: ప్రతి వారం ఓటీటీలో పదుల కొద్దీ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే, వీటిలో అత్యధిక రేటింగ్ ఉన్న వెబ్ సిరీస్ లు ఏవో, అవి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో .. వాటి వివరాలు తెలుసుకుందాం.
Swetha
ఇండియాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో రిలీజ్ అయినా ఏ సినిమాకైనా, సిరీస్ కైనా సరే.. సాధారణ ప్రేక్షకులు ఐఎండీబీలో రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఐఎండీబీ అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ .. థియేటర్ లో వచ్చే సినిమాలకు, ఓటీటీలో వచ్చే సినిమాలకు , సిరీస్ లకు ప్రేక్షకులు రేటింగ్ ఇస్తూ ఉంటారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఇచ్చే రేటింగ్ ను బట్టి.. కొంతమంది ప్రేక్షకులు ఆ సినిమాలను చూడాలా వద్దా అని కూడా డిసైడ్ అవుతూ ఉంటారు. అయితే, మరి ఇప్పటివరకు వందల సంఖ్యలో ఓటీటీలోకి సినిమాలు, సిరీస్ లు వచ్చాయి.. మరి, వాటిలో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో అత్యధికంగా రేటింగ్ సాధించి.. టాప్ 1లో ఉన్న సినిమాలు.. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఐఎండీబీ వాటికీ ఎంత రేటింగ్ ఇచ్చిందో .. ఆ వివరాలను తెలుసుకుందాం.
సోనీలివ్:
1) స్కామ్ 1992 :
2020లో వచ్చిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ .. సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 1992లో హర్షద్ మెహతా చేసిన స్టాక్ మార్కెట్ కుంభకోణం చుట్టూ.. ఈ కథ సాగుతుంది. ఇది ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా పేరొందింది. ఇక దీనికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో అత్యధికంగా.. 9.3 రేటింగ్ ఉంది.
2) గుల్లక్:
మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెట్టింది పేరు ఇండియా. దాదాపు ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అందరి ఇళ్ల వద్ద.. ఓ పిగ్గీ బ్యాంక్ ఉంటుంది. ఈ పిగ్గీ బ్యాంక్ చుట్టూ తిరిగే కథే గుల్లక్. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసే వెబ్ సిరీస్ ఇది. ఇక దీనికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో 9.1 రేటింగ్ ఉంది.
ప్రైమ్ వీడియో:
3) ఆస్పిరెంట్స్ :
దేశంలోనే అత్యంత కఠిన పరీక్షలలో ఒకటైనా.. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ను.. క్రాక్ చేసి.. ఐఏఎస్ కావాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆలా ఐఏఎస్ కావాలని కలలు కనే.. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ సస్టోరీ.. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ మూవీకి 9.2 రేటింగ్ వచ్చింది.
4) పంచాయత్ :
దేశంలో ఏటా లక్షల్లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తూ ఉంటారు. వారిలో ఇంజినీరింగ్ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలని భావించే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే తన ఇంజినీరింగ్ తర్వాత ఓ పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాలనీ కలలు కన్న యువకుడు.. చివరికి ఓ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఎటువంటి కష్ఠాలను పడ్డాడు. ఆ ఊరి బాగుకోసం ఎలా శ్రమించాడు? అనేదే ఈ సిరీస్ కథ. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ మూవీకి 8.9 రేటింగ్ ఉంది.
5) ది ఫ్యామిలీ మ్యాన్:
మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో 8.7 రేటింగ్ ఉంది.
6) పర్మనెంట్ రూమ్మేట్స్:
ఈ మధ్య కాలంలో లివింగ్ రిలేషన్స్ అనేవి కామన్ అయిపోయాయి. అలానే మూడేళ్ళ రిలేషన్ లో ఉన్న ఓ జంట పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు .. ఈ క్రమంలో వీరి మధ్య ఎటువంటి గొడవలు జరిగాయి . వాళ్ళు వాటిని ఎలా అధిగమించారు అనేదే ఈ సినిమా కథ. దీనికి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో 8.6 రేటింగ్ ఉంది.
7) జూబ్లీ:
ఇది బాలీవుడ్ తొలినాళ్లలోని రాయ్ టాకీస్ స్టూడియో చుట్టూ తిరిగే కథ. అప్పటి సినిమా రాజకీయాలను కళ్లకు కట్టినట్లు ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో వెబ్ సిరీస్ కు 8.3 రేటింగ్ ఉంది.
నెట్‌ఫ్లిక్స్:
8) సేక్రెడ్ గేమ్స్:
ఈ సిరీస్ లో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీలాంటి .. పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. ఈ సిరీస్ కు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో 8.5 రేటింగ్ ఉంది.
9) ది రైల్వే మెన్ :
1984లో జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ విషాదంపై.. ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఆ సమయంలో భోపాల్ స్టేషన్ లో ఉన్న రైల్వే సిబ్బంది ఎంతో మంది నగర వాసుల ప్రాణాలను ఎలా కాపాడారో ఈ సిరీస్ లో చూపించారు. ఇక ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ సిరీస్ కు 8.5 రేటింగ్ ఉంది.
10) ఢిల్లీ క్రైమ్ :
2012లో ఢిల్లీలో నిర్భయ రేప్ కేసు సంఘటన.. దేశంలో ఎలాంటి చర్చలు సృష్టించిందో తెలియనిది కాదు. ఈ ఘటన ఆధారంగా రూపొందించిన సిరీస్ ఏ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ కు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో.. 8.5 రేటింగ్ ఉంది.
మరి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో.. అత్యధిక రేటింగ్స్ ఉన్న ఈ టాప్ 10 వెబ్ సిరీస్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.