Swetha
కొన్ని కొన్ని సినిమాలు అనుకోకుండా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రత్యేక్షం అవుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఓటీటీ లోకి వచ్చినా ఓ సినిమా కూడా అలానే ఇప్పుడు సైలెంట్ గా మరొక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రత్యేక్షం అయింది.
కొన్ని కొన్ని సినిమాలు అనుకోకుండా రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రత్యేక్షం అవుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఓటీటీ లోకి వచ్చినా ఓ సినిమా కూడా అలానే ఇప్పుడు సైలెంట్ గా మరొక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రత్యేక్షం అయింది.
Swetha
పదుల సంఖ్యలో ఓటీటీ లోకి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ క్రమంలో కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన సమయానికి రాకపోవడమో.. లేదా ముందుగా ఓ ప్లాట్ ఫార్మ్ లో అనౌన్స్ చేసి.. ఆ తర్వాత మరొక ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ క్రమంలో మే 8 న రిలీజ్ అవ్వాల్సిన గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా.. అనుకున్న సమయానికి ఓటీటీ లోకి రాలేక పోయింది. దీనితో కాస్త అప్ సెట్ అయ్యారు ఓటీటీ లవర్స్. అయితే.. అనుకున్న టైం కి అయితే ఈ సినిమా రాలేదు కానీ.. అనౌన్స్ చేసిన రోజునే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరొక ఓటీటీ లో కూడా ఈ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమాను మొదట మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్ . కానీ ఆ తర్వాత అనుకున్న దానికంటే రెండు రోజులు ముందు నుంచే ఈ సినిమాను ఆహ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అది కూడా జరగలేదు. మే 8 నుంచి అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. కానీ ఈ సినిమా అదే రోజు కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహ లో మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుండగా.. సైలెంట్ గా మరొక ఓటీటీ అంటే.. ముందుగా ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో కూడా చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు.
ఇక ఈ సినిమా కథ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మొదటి పార్ట్ కు సిక్వెల్ గా తీసినా కూడా ఈ సినిమాకు ఆ సినిమాకు కనెక్షన్ అయితే ఏమి ఉండదు. ఇక థియేటర్ లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ ఓటీటీ లో మాత్రం ఈ సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి. చాల వరకు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా థియేటర్ లో హిట్ అవ్వకపోయినా ఓటీటీ లో మాత్రం అదరగొడుతున్నాయి, ఈ సినిమా కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయింది అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ సినిమా రెండు ఓటీటీ లలో రిలీజ్ అయింది కాబట్టి.. లాంగ్ రన్ లో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.