OTT Movie Suggestion: OTTలోకి లైన్‌మెన్ .. ఇది మన ఊరి కథ! మన అందరి వ్యథ! సూపర్ మూవీ!

ఓటీటీ లోకి సైలెంట్ గా వచ్చే కొన్ని సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో ఓ మూవీ వచ్చేసింది . ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే.

ఓటీటీ లోకి సైలెంట్ గా వచ్చే కొన్ని సినిమాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో ఓ మూవీ వచ్చేసింది . ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే.

ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయినా కానీ.. కొన్ని సార్లు ఎందుకో ఆయా సినిమాలు, సిరీస్ లు ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. దీనితో ప్రేక్షకులు ఇంకా ఓటీటీ లో ఏమైనా సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు, అలాంటి సమయంలో మంచి మంచి మూవీ ఉన్నా కానీ.. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వలనో.. లేదా ఆయా సినిమాల గురించి అంతగా బజ్ లేకపోవడం వలనో కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సైలెంట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాను కనుక లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి మూవీని మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “లైన్ మ్యాన్ “. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది . తెలుగు సినిమాలలో కొన్ని ముఖ్యమైన పాత్రల్లో కనిపించి మెప్పించిన.. అదిత్ అరుణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. మార్చి 22 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మే 4 నుంచి ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమాకు రఘు శాస్త్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను అయితే మెప్పించలేకపోయింది. కానీ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో మాత్రం 7.7 రేటింగ్ ను దక్కించుకుంది. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు.. ఈ సినిమా వర్త్ వాచింగ్ అని. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా లైట్ తీసుకుంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే. అసలు ఈ సినిమా కథేంటి.. ఎందుకు ఈ సినిమా వర్త్ వాచింగ్ అనే విషయానికొస్తే..

ఈ సినిమా కథేంటంటే.. ఓ చిన్న గ్రామంలో లైన్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు హీరో.. హీరో తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం అతనికి వస్తుంది. మంచిగా పని చేసుకుంటూ.. గ్రామంలో అందరికి దగ్గరగా ఉంటూ ఉంటాడు. అయితే అదే గ్రామానికి చెందిన మహాదేవ్ కి మాత్రం హీరో అంటే పడదు. అయితే, ఒకానొక సందర్భంలో హీరో ఊరిలో జరుగుతున్న ఓ వేడుకకు లైట్స్ సిద్ధం చేయాల్సి వస్తుంది. కానీ అతను లైట్స్ ఆన్ చేయడు. దీనితో ఊరి జనం అంతా కూడా అతనిపై మండిపడతారు. దీనితో అప్పటినుంచి ఊరంతా కూడా రాత్రి సమయాల్లో లైట్స్ లేకుండానే గడపాల్సి వస్తుంది. దీనితో అప్పటివరకు సోషల్ మీడియాతో సమయం గడిపిన ప్రజలంతా కూడా.. ఒకరితో సమయం గడపడం మొదలు పెడతారు. దీనితో మళ్ళీ తిరిగి అందరు అతనిని మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఊరిలో ఉన్న కొంతమంది మాత్రం అతనికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు హీరో ఎందుకు కరెంట్ ఇవ్వనన్నాడు ! ఊరిలో ఉన్న తన శత్రువుల నుంచి ఎలా తప్పించుకోగలిగాడు ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments