Swetha
బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట కూడా బాగా ఫేమస్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. దీనితో ఈ హీరో సినిమా గురించి కూడా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ హీరో నటించిన సినిమా గురించి ఓటీటీ టాక్ వినిపిస్తోంది.
బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట కూడా బాగా ఫేమస్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. దీనితో ఈ హీరో సినిమా గురించి కూడా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ హీరో నటించిన సినిమా గురించి ఓటీటీ టాక్ వినిపిస్తోంది.
Swetha
విజయ్ ఆంటోనీ తమిళ నాట ఈ హిరోకు ఎంత క్రేజ్ ఉందో. తెలుగులో కూడా ఈ హీరోకు అంతే క్రేజ్ ఉంది. దీనితో ఈ హీరో నటించిన సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల విజయ్ తమిళ్ లో నటించిన సినిమా రోమియో. ఏప్రిల్ 11 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్ రిలీజ్ కంటే ముందు.. రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు ఈ సినిమాపై ఎన్నో ఎక్స్పెక్టషన్స్ ను పెంచేసింది. కానీ, ఈ సినిమా విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఈ సినిమాను ఓటీటీ డేట్ పై టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లోకి రానుంది అనే విషయాలను చూసేద్దాం.
రోమియో సినిమాకు వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు.. మృణాళిని రవి, యోగి బాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్, శ్రీజ రవి ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు ఈ మూవీ స్ట్రీమింగ్ పార్టనర్ ఆహ తమిళ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అప్ డేట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా తమిళ్ లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇదే సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తెలుగు ఓటీటీ మీద మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. తెలుగు ఓటీటీ అప్ డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫార్మ్ దగ్గర కూడా ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో రానుంది అనే విషయాన్నీ మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో హీరో ఒక బిజినెస్ మెన్.. కుటుంబ బాధ్యతల కారణంగా ప్రేమ, పెళ్లి లాంటి అన్ని బంధాలకు దూరంగా ఉంటాడు. అతనికి ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాత పెద్దలచేత నిర్ణయించబడిన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఆమెకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి. తనని తానూ ఒక హీరోయిన్ గా చేసుకోవాలన్నది తన కోరిక.. ఈ క్రమంలో ఆమెను అర్ధం చేసుకున్న హీరో.. తానే ఒక హీరోగా, నిర్మాతగా మారి ఒక సినిమాను తీయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది! అనుకున్నట్లుగానే వారివురు సినిమాను తీసారా లేదా ! ఇష్టం లేకుండా అతనిని పెళ్లి చేసుకున్న ఆమె చివరికి అతనిని భర్తగా అంగీకరిస్తుందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేంత వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.