OTT Movie Suggestion: మీరు ఎన్నో మర్డర్ మిస్టరీస్ చూసుండొచ్చు.. OTTలో ఈ మూవీని చూస్తే వణికిపోతారు!

Best Crime Investigatin Thriller in OTT: కొద్దిసేపు హర్రర్, రొమాన్స్ జోనర్స్ పక్కనపెట్టేస్తే.. అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే జోనర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు. అలాంటి ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఓ వర్త్ వాచింగ్ సినిమాను మిస్ అయినట్లే.

Best Crime Investigatin Thriller in OTT: కొద్దిసేపు హర్రర్, రొమాన్స్ జోనర్స్ పక్కనపెట్టేస్తే.. అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే జోనర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు. అలాంటి ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఓ వర్త్ వాచింగ్ సినిమాను మిస్ అయినట్లే.

నిజంగా చెప్పాలంటే సినిమాలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది. ఆ మూవీస్ స్టోరీస్ ఎలా ఉన్నా.. అందులో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా.. సినిమా చిన్నదైనా పెద్దదైన సరే.. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక ప్లాట్ ఎవరిని ఒకరిని ఇంప్రెస్స్ చేస్తుంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో దాదాపు థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఓటీటీ లో మంచి పేరు తెచ్చుకుంటుంటే.. అసలు ఏ అంచనా లేకుండా విడుదల చేసిన సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. మేకర్స్ కూడా దీని గురించి సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఇక కొద్దిసేపు హర్రర్, రొమాన్స్ జోనర్స్ పక్కనపెట్టేస్తే.. అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండే జోనర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ముందుగా గుర్తొచ్చేది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇటువంటిదే. ఈ సినిమాను మీరు మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా అక్కడ క్రైమ్ ప్లాట్ కూడా ఉండే ఉంటుంది. మరి ఆ క్రైమ్ సైకో పాత్ ను, సస్పెన్స్ జోడిస్తే.. కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథేంటంటే.. ఈ అపార్ట్మెంట్ లోకి ఓ కొత్త జంట ప్రవేశిస్తారు. అయితే ఈ జంట ఎవరి చేతనో హత్య చేయబడతారు. ఇక ఈ హత్య కేసును సాల్వ్ చేయడానికి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అతని పేరు దీపక్ . అతను వెంటనే ఈ కేసును సాల్వ్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ కేసును సాల్వ్ చేయడం అనుకున్నంత సులువుగా అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ ఒకటే ప్రదేశంలో 16 వేరు వేరు సంఘటనలు జరుగుతాయి. పైగా అవన్నీ జరగడానికి 16 గంటల సమయం పడుతుంది. మరి ముఖ్యంగా దీనిలో 16 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు.

ప్రతి గంటకు ఆ కేసు గందరగోళంగా తయారౌతుంది. చాలా నేరాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇలా అన్ని ప్లాట్స్ కేసును మరింత ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకుని వెళ్తాయి. చి అసలు ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు ! ఆ 16 సంఖ్యకు ఈ సినిమాకు సంబంధం ఏంటి ! ఆ మర్డర్స్ అంతా ప్లాన్ గా చేస్తుంది సైకో కిల్లర్ ఆ లేకుంటే ఇంకెవరైననా ! అసలు ఏం ఆశించి ఈ మర్డర్ చేశారు !.. దీపక్ చివరికి ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. వరి వరకు కూడా ఈ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అనేది.. చాలా ఎంగేజింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే “16-ఎవ్రీ డీటెయిల్ కౌంట్“.

ఇక క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంటే అందరి ఊహ మలయాళీ, తమిళ చిత్రాలవైపు వెళ్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఓ తెలుగు సినిమా .. తెలుగులో కూడా ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాకు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments