2 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్‌ హీరో సినిమా!

2018 సినిమా మలయాళంతో పాటు దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయింది. తెలుగులో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. 2018 సినిమా తర్వాత టొవినో థామస్‌ ‘అదృశ్య జలకంగల్‌’ అనే సినిమాలో నటించారు.

2018 సినిమా మలయాళంతో పాటు దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయింది. తెలుగులో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. 2018 సినిమా తర్వాత టొవినో థామస్‌ ‘అదృశ్య జలకంగల్‌’ అనే సినిమాలో నటించారు.

ఓటీటీ వాడకం పెరిగిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని సినిమాలు చూడ్డం బాగా ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు చెందిన సినిమాలు చూసే అవకాశం ఉండటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు అడిక్ట్‌ అయిపోతున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి బాగా పెరిగింది. జనం సినిమా థియేటర్లకంటే  ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కూడా తమకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి.

సినిమా థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ప్రముఖ మలయాళ హీరో టివినో థామస్‌ నటించిన ‘అదృశ్య జలకంగల్‌’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్దం అయింది. ఈ చిత్రం నవంబర్‌ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. మలయాళంలో ప్రేక్షకులతో పాటు, రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రివ్యూలను తెచ్చుకుంది. ఇక, ఈ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

‘ అదృశ్య జలకంగల్‌’ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అఫిషియల్‌ కన్‌ఫర్‌మేషన్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనుంది. డిసెంబర్‌ 8 నుంచి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ సినిమాకు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కూడా నిర్మాణ బాధ్యతల్ని చేపట్టింది. టొవినోకు జంటగా.. నిమిష సజయాన్‌ నటించారు.

‘అదృశ్య జలకంగల్‌’ సినిమా కథేంటంటే.. 

హీరో టివినో థామస్‌ ఓ మానసిక రోగంతో బాధపడుతూ ఉంటాడు. అతడు మెంటల్‌ ఆ‍స్పత్రినుంచి విడుదలై బయటకు వస్తాడు. తర్వాతినుంచి ఊర్లోనే ఉంటాడు. మెంటల్‌ ఆస్పత్రిలో చేరకముందు ఏ పని అయితే  చేసే వాడో అదే పనిలో చేరతాడు. ఓ శవాల గది దగ్గర నైట్‌ వాచ్‌మ్యాన్‌గా పని చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో అతడికి కొన్ని వింత వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.

ఆ అనుభవాల కారణంగా అతడి జీవితం ఎలా మారింది?.. అతడి మానసిక రోగం వల్ల చివరికి అతడి పరిస్థితి ఏమైంది? అన్నదే మిగితా కథ. మానసిక రోగి పాత్రలో టొవినో థామస్‌ అద్భుతంగా నటించాడు. కెరీర్‌ బెస్ట్‌ నటనను ఇచ్చాడు. సినిమాలో టొవినో థామస్‌ నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి, టొవినో థామస్‌ నటించిన అదృశ్య జలకంగల్‌’ సినిమా ఓటీటీలోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments