ధైర్యే సాహసే దీదీ, అదే ఆమెకు శ్రీరామరక్ష

ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు. కానీ ధైర్యే సాహసే పదవి అంటుంటారు పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజేత మమతా బెనర్జీ. ఆమె నాలుగు దేశబ్దాల రాజకీయ జీవితం పొడవునా అదే పరంపర. నేటికీ ఆ పంథాని ఆమె వీడడం లేదు. యువనేతగా కాంగ్రెస్ రాజకీయాల్లోంచి వచ్చిన మమతా బెనర్జీ ఆనాడు చూపించిన తెగువనే ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నారు. అందుకే బెంగాల్ లో మమతకి అడ్డుకట్ట వేయాలన్న మోడీ- షా ద్వయం ఎత్తులు ఫలించలేదు. బెంగాలీల మనసు గెలుచుకున్న మమతా బెనర్జీ మరోసారి అధికారం నిలబెట్టుకుని దేశమంతా చర్చనీయాంశం అయ్యారు.

ముఖ్యంగా నందిగ్రామ్ అసెంబ్లీ సీటు విషయంలో ఆమె ప్రదర్శించిన పట్టుదల ఆశ్చర్యం వేస్తుంది. సుదీర్ఘకాలంగా తన సొంత నియోజకవర్గంగా ఉన్న భవానీపూర్ సీటు వదులుకుని నందిగ్రామ్ వెళ్లి పోటీ చేయడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. గట్టిపోటీ ఉంటుందని ముందే ఊహించిన మమతా అక్కడ బరిలో దిగడం ద్వారా బీజేపీని వ్యూహాత్మకంగా ఇరకాటంలోకి నెట్టింది. బెంగాలీ బీజేపీ నేతలు సహా మోడీ కూడా మమతా బెనర్జీకి నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసరడంతో సై అంటూ సిద్ధమయ్యారు ఊహించని బీజేపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశారు రాజకీయాల్లో అలాంటి సవాళ్ళు సహజంగా ప్రకటనల వరకే ఉంంటాయి. కానీ మమతా రూటు సెపరేటు కాబట్టి ఆమె నేరుగా నందిగ్రామ్ లో కాలు పెట్టి బీజేపీ నేతలను సైతం ఆశ్యర్యపరిచారు

ఓవైపు నిజమైన పోరాటయోధురాలిలా తాను ముందుండి పోరాడుతూ క్యాడర్ లో ఆత్మస్థైర్యం నింపారు. అదే సమయంలో బెంగాల్ బీజేపీ తురుపుముక్కగా భావించిన సుబేందు అధికారిని అక్కడికే పరిమితం చేశారు. ఆయన తన గెలుపు కోసమే మొత్తం సమయమంతా వెచ్చించాల్సి వచ్చింది. స్థానికంగా గట్టి పట్టున్న తన విజయాన్ని మమతా అడ్డుకోకుండా చూసుకునే క్రమంలో ఆయన ఇతర నియోజకవర్గాల మీద దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. చివరకు మోడీ- అమిత్ షా కూడా అక్కడ పర్యటనలు చేయాల్సి వచ్చింది. అమిత్ షా అయితే వాడవాడలా ప్రచారయాత్రలు సాగించాల్సి వచ్చింది.

ఇంత చేసినా వీర మహిళగా నందిగ్రామ్ లో మమతా విజయం రాజకీయంగా పెను సంచలనంగానే చెప్పారు. దాదాపు 10 రౌండ్ల వరకూ ఆమె వెనుకబడి ఉన్నారు. ఓ దశలో దాదాపు 9వేల ఓట్ల ఆధిక్యం బీజేపీకి దక్కింది. దాంతో బెంగాల్ లో మమతా ఓడిపోయి, టీఎంసీ విజయం సాధిస్తే ఏంటి పరిస్థితి అనే చర్చలు కూడా జరిగాయి. కానీ చివరకు అలాంటి వాటికి చెక్ పెడుతూ బీజేపీ నేతలకు మింగుడుపడని రీతిలో మమతా 1200 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాజకీయంగా బెంగాలీల మనసు గెలిచిన నేతగా నిలిచారు.

Also Read : ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ‘వ్యూహ సన్యాసం’

Show comments