రెండు రోజుల్లో ఏడు సినిమాలు

ఆగస్ట్ రెండు వారాలు టాలీవుడ్ కు మహదానందంగా గడిచిపోయాయి. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెట్టడంతో మాచర్ల నియోజకవర్గం చేసిన గాయాన్ని జనం ఇండస్ట్రీ లైట్ తీసుకున్నారు. నిఖిల్ సినిమా ముఖ్యంగా నార్త్ లో బాగా ఆడుతుండటం, అరవైతో మొదలుపెట్టి ఏడు వందల దాకా స్క్రీన్ కౌంట్ పెరగడం మాములు అచీవ్ మెంట్ కాదు. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఏకంగా పుష్ప 2తో దీన్ని పోల్చడం చూస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టుకుందో అర్థమవుతోంది. నిన్న మంగళవారం కాబట్టి సహజంగానే కొంత డ్రాప్ ఉంది కానీ మళ్ళీ ఈ వీకెండ్ పికప్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ గురు శుక్రవారాలు ఏకంగా ఎనిమిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతున్నాయి. రేపు ధనుష్ ‘తిరు’ని థియేటర్లకు తీసుకొస్తున్నారు. దీని మీద ఇక్కడ కనీస బజ్ లేదు. రిలీజ్ డేట్ ని హడావిడిగా లాక్ చేసి చివరి నిమిషంలో డిస్ట్రిబ్యూటర్లను ఫిక్స్ చేసుకున్నారు. ఏషియన్, సురేష్ ల సహాయంతో తిరు ఓ మోస్తరు విడుదలను చేసుకోబోతోంది. కాకపోతే స్క్రీన్ కౌంట్ తక్కువగానే ఉంటుంది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్. ఇక కామెడీని నమ్ముకుని వస్తున్న ‘ఒరేయ్ పండుగాడ్’ కి శ్రీధర్ సీపాన దర్శకుడు. రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో ఏదో హడావిడి చేశారు కానీ ఇదేదో అద్భుతాలు చేస్తుందని ఆశించలేం.

సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకున్న ‘మాటరాని మౌనమిది’ 19నే రానుంది. పెద్ద హడావిడి కనిపించకపోయినా దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కమిట్మెంట్, లవ్ టు లవ్, అంఅఃలు కూడా రేస్ లో ఉన్నాయి. ఆది సాయికుమార్ ‘తీస్ మార్’ ఖాన్ కూడా వీటితో పాటే దిగుతోంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా అవకాశాలకు లోటు లేకుండా చూసుకుంటున్న ఆది ఎప్పటిలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కానీ ప్రమోషన్లు గట్రా చూస్తుంటే రొటీన్ గానే అనిపిస్తోంది. పాయల్ రాజ్ పుత్ తనకు జోడిగా నటించింది. మొత్తానికి చెప్పుకోవడానికైతే ఏడెనిమిది సినిమాలు వస్తున్న సందడి అనిపిస్తోంది కానీ టాక్ చాలా బాగుంటే తప్ప ఓపెనింగ్స్ ఆశించలేం

Show comments