క్షీణిస్తోన్న రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం.. ఇక రెండేళ్లే !

రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ (69) ఆరోగ్యం రోజురోజుకూ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్లకు మించి జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ తెలిపారు. ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించిన తనకు.. పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన పక్కా సమాచారం ఉన్నట్లు కైరిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆరంభం నుంచీ పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచూ సమావేశమవుతూ.. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి రష్యా విడుదల చేస్తున్న ఫొటోలలో పుతిన్ కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలోనూ పుతిన్ ఎక్కువ సమయం నిలబడలేక ముందుకీ వెనక్కీ ఊగుతూ కనిపించారు.

ఇకపై బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు పుతిన్ కు సూచించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కైరిలో చెప్పిన విషయం నిజమే అనిపించేలా ఉంది. అంతేకాదు పుతిన్ కంటిచూపు కూడా తగ్గినట్లు సమాచారం. ఆయనకు పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా వంటి లక్షణాలు కూడా ఉన్నట్లు రష్యా వర్గాలు చెప్పాయి. కాగా.. పుతిన్ కు గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. సర్జరీ జరిగినా.. ఆయనలో క్యాన్సర్ లక్షణాలు పోలేదని, ఇప్పుడు అవే తీవ్రతరమై పుతిన్ ను బాధిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Show comments