iDreamPost
iDreamPost
రెండు వారాలు తిరక్కుండానే భారీ అంచనాలతో వచ్చిన లైగర్ ఫైనల్ రన్ కు వచ్చేసింది. మొదటి వారంలోనే డెఫిషిట్లు మొదలైనప్పటికీ ముందస్తుగా చేసుకున్న అగ్రిమెంట్ల వల్ల థియేటర్లలో ఇంకా కొనసాగుతోంది. పేరుకు పైన పోస్టర్ ఉంది కానీ చాలా చోట్ల క్యాన్సిల్ చేసిన షోలే ఎక్కువ. కనీసం సింగిల్ డిజిటల్ ఆడియన్స్ అయినా రాకపోతే ఎగ్జిబిటర్లు మాత్రం ఏం చేస్తారు. ఇటీవలే నైజామ్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను మాట్లాడుతూ దీని మీద తాను నలభై శాతానికి పైగా నష్టపోయానని, విజయ్ యాటిట్యూడ్ కన్నా క్లైమాక్స్ సరిగా తీయకపోవడం వల్ల కలిగిన డ్యామేజే ఎక్కువనే తరహాలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయ్ దేవరకొండ తన పారితోషకంలో మూడు కోట్లకు వెనక్కు ఇచ్చాడనే ప్రచారం కూడా రెండు రోజుల నుంచి ఊపందుకుంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందులో నిజం లేదట. ప్రాజెక్టు మొదలుపెట్టే టైంలోనే విజయ్, పూరి జగన్నాధ్ లు కంటెంట్ మీదున్న నమ్మకంతో పారితోషికం లేకుండా రిలీజ్ తర్వాత లాభాలు పంచుకుందామనే ఒప్పందం చేసుకుని బరిలో దిగారట. నామినల్ గా విజయ్ దేవరకొండకు తొలుత అడ్వాన్స్ రూపంలో ముట్టిన మొత్తం కేవలం మూడు కోట్లేనట. అయితే అనూహ్యంగా బొమ్మ డిజాస్టర్ కావడంతో బయ్యర్లకు నలభై కోట్ల దాకా రిటర్న్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ బాధ్యత పూరి కనెక్ట్స్ సంస్థదే.
పైగా హిందీ వెర్షన్ ని ప్రమోట్ చేసిన కరణ్ జోహార్ పెట్టుబడి కూడా ఏం లేదట. కేవలం తన నెట్ వర్క్ వాడుకుని ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా డిస్ట్రిబ్యూషన్ లో మాత్రమే సహాయం చేసినట్టు ముంబై న్యూస్. సో తన మీద భారమేమీ లేదు. ఇవన్నీ యూనిట్ నుంచి వచ్చిన అధికారిక సమాచారాలు కాకపోయినా ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. పోనీ జనగణమనతో సర్దుదాం అది అసలే రద్దయ్యే సిచువేషన్ లోకి వెళ్లిపోయింది. పైగా పూరికి ఇప్పటికిప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోలు లేరు. ఐస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లానింగ్ అంటున్నారు కానీ ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ రిస్క్ చేసి ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. చూద్దాం