iDreamPost
iDreamPost
మాములుగా టాలీవుడ్ కు సంక్రాంతికి మించిన కమర్షియల్ సీజన్ మరొకటి లేదు. ఏడాది పొడవునా చాలా పండుగలు ఉన్నాయి కాని రెవిన్యూ పరంగా దేనితోనూ సంక్రాంతికి పోలిక రాదు. తర్వాత కొద్దోగొప్పో సెలవులు ఎక్కువ వస్తాయి కాబట్టి దసరాని చెప్పుకోవచ్చు. దీపావళి కూడా మనకు వర్క్ అవుట్ కాని సీజనే. ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరాదే అయినా దాన్ని ఒక్క రోజు మాత్రమే చేసుకుంటారు కాబట్టి సినిమాల పరంగా పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు తక్కువ.
ఇవి చాలవు అన్నట్టు తాజాగా యాంకర్ ప్రదీప్ హీరోగా డెబ్యు చేస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా అదే తేదిని కన్ఫర్మ్ చేసుకుంది. నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. బిజినెస్ పరంగా కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయట. మరి నాని, రాజ్ తరుణ్ లను ప్రదీప్ ఎంతవరకు ఫేస్ చేయగలడో చూడాలి. తెలుగువి ఇలా ఉంటే హింది మల్టీ స్టారర్ సుర్యవంశి కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో దీని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యురియాస్ లేటెస్ట్ ఎడిషన్ ని తక్కువ అంచనా వేయలేం. ఈ నేపధ్యంలో లాంగ్ వీకెండ్ తో ఊరిస్తున్న ఉగాది ఇన్ని సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడనుందో వేచి చూడాలి.