మద్యానికి బానిసైన వ్యక్తి కారణంగా ఓ కుటుంబం ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. తాగుబోతైన తండ్రి చేసే గొడవులు చిన్నారు విలవిల్లాడి పోతుంటారు. అమ్మను తండ్రి కొడుతున్న చూస్తూనే ఉండి పోతారే కానీ.. ఎదిరించే ధైర్యం చేయలేరు. చాలా తక్కువ మంది మాత్రమే తాగుతు తండ్రిపై ధైర్యంగా ఎదురు తిరుగుతారు. అంతేకాక పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి.. ఫిర్యాదు చేస్తుంటారు. తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు కూడా అలాంటి పనే చేశాడు. తాగుబోతైన తండ్రి కొట్టే దెబ్బల నుంచి తన తల్లిని రక్షించుకునేందుకు ఆ బాలుడు సాహసం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా ప్రాంతంలోని జెబ్రా గ్రామంలో బాహ్ బ్లాక్ లో హరిఓం(40)అనే వ్యక్తి, భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. బాహ్‌లోని ఓ ప్రైవేటు కర్మాగారంలో అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసగా మారి నిత్యం తాగి.. ఇంటికి వెళ్లే వాడు. అంతేకాక తన భార్యను ఇనుప గొట్టం, బెల్టుతో తరచూ కొడుతుండే వాడు. అలానే మంగళవారం కూడా తాగి వచ్చి.. భార్యను బెల్టుతో కొడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన అతని కుమారుడు చాలా బాధ పడ్డాడు. తండ్రి నుంచి తల్లిని ఎలాగైన రక్షించాలని భావించాడు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నబసోని పోలీసు స్టేషన్‌కు కాలి నడక చేరుకున్నాడు.
అనంతరం అక్కడ తన తల్లిని తండ్రి హింసిస్తున్న సంగతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మద్యానికి బానిసని, నిత్యం తన తల్లిని మానసిక, శారీకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పాడు. దీంతో వెంటనే ఆ బాలుడిని వెంటబెట్టుకుని పోలీసు బృందం వారింటికి వెళ్లి.. హరిఓంను అరెస్టు చేసింది. అయితే తన భర్తపై ఎటువంటి కేసులు పెట్టవద్దంటూ అతని భార్య చేసిన విజ్ఞప్తి చేసింది. ఆమె కోరిక మేరకు హరిఓంను పోలీసులు విడిచిపెట్టింది. ఇకపై ఎప్పుడూ తన భార్యపై చెయ్యి చేసుకోనంటూ హరిఓం పోలీసులకు హామి ఇచ్చాడు. తండ్రిపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాలుడి ధైర్యాన్ని పోలీసులతోపాటు గ్రామస్థులు అభినందించారు. మరి.. అమ్మ కోసం బాలుడు చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.