iDreamPost
iDreamPost
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మాయలో పడితే ఏమవుతుందో తాజాగా ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో బయటపడివది. స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఓ లేఖ వెళ్ళిన విషయం గుర్తుందికదా. ఆ లేఖకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖను నిమ్మగడ్డ రాయలేదనేందుకు ఆధారాలు బయటపడ్డాయి.
లేఖను నిమ్మగడ్డ రాయలేదని పెన్ డ్రైవ్ ద్వారా బయట ఎక్కడి నుండో వచ్చిందని తేలిపోయింది. నిమ్మగడ్డ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న సిఐడి అడిషినల్ డిజి బృందానికి మాజీ కమీషనర్ దగ్గర అడిషినల్ పిఎస్ గా పనిచేసిన సాంబమూర్తి పూసగుచ్చినట్లు చెప్పేశాడు. లేఖ ఎలా వచ్చింది, కంప్యూటర్లోకి ఎలా ఎక్కింది, కేంద్రహోంశాఖకు ఎలా వెళ్ళిందనే విషయాలను అడిషినల్ పిఎస్ స్పష్టంగా వివరించాడు. అంటే సాంబమూర్తి సాక్ష్యం ప్రకారం లేఖను ఎవరో రాసి నిమ్మగడ్డకు అందించారన్న విషయం తేలిపోయింది.
అయితే లేఖను ఇచ్చింది ఎవరు, డ్రాఫ్ట్ చేసిందెవరనే విషయం కూడా బయటపడుతుంది. మొత్తానికి నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖను టిడిపి వాళ్ళే డ్రాఫ్ట్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి.
మొత్తానికి చంద్రబాబు మాయలో పడితే చివరకు ఏమవుతుందనేందుకు నిమ్మగడ్డ వ్యవహారం తాజాది మాత్రమే. ఎందుకంటే మొన్నటికి మొన్న శాసనమండలిలో రెండు బిల్లులను మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సెలక్ట్ కమిటికి పంపాడు. సెలక్ట్ కమిటికి పంపటం కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే జరిగినట్లు తేలిపోయింది.
మండలిలో మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో బిల్లులను టిడిపి అడ్డుకుంటోంది. దాంతో జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళుమండిపోయి అసలు మండలినే రద్దుకే తీర్మానం చేయించాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సిఆర్డీఏ చట్టం రద్దు, రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలభివృద్ధికి ఓ చట్టం రూపొందించటం కోసం రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. అయితే మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో ఛైర్మన్ ను అడ్డుపెట్టుకుని సెలక్ట్ కమిటికి బిల్లును పంపుతున్నట్లు షరీఫ్ తో ప్రకటన చేయించాడు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఉండకపోతే మండలి రద్దు విషయాన్ని జగన్ ఆలోచించేవాడు కాదేమో.
దాదాపు ఐదేళ్ళ క్రితం తెలంగాణా ఎంఎల్సీ ఎన్నికల్లో లేని ఓటుకోసం ప్రయత్నించి రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికించేశాడు. నామినేటెడ్ ఎంఎల్సీ ఓటుకోసం డబ్బును ఎరగా వేసి చివరకు రేవంత్ ను బలిచేశాడు. అదే ’ఓటుకునోటుగా’ దేశంలో సంచలనమైంది. మధ్యలో చంద్రబాబు మాయలోపడి 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిల్లో ఎంతమంది బలైపోయారో అందరూ చూసిందే. మొత్తానికి చంద్రబాబు మాయలో పడితే రేవంత్ దగ్గర నుండి నిమ్మగడ్డ వరకూ ఎలా బలైపోతారో అందరికీ అర్ధమవుతోంది.