Krishna Kowshik
కష్టాలు అందరికీ ఉంటాయి. ఒక్కొక్కరు త్వరగా బయట పడిపోతారు. మరికొంత మంది పంటిబిగువన దాచేస్తూ.. చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటారు. బాధ చెప్పుకుంటే కాస్త తగ్గుతుంది కానీ.. సమస్య తీరదు. కానీ ఆ చెప్పుకునే వ్యక్తులే లేకపోతే..
కష్టాలు అందరికీ ఉంటాయి. ఒక్కొక్కరు త్వరగా బయట పడిపోతారు. మరికొంత మంది పంటిబిగువన దాచేస్తూ.. చిరునవ్వులు ఒలికిస్తూ ఉంటారు. బాధ చెప్పుకుంటే కాస్త తగ్గుతుంది కానీ.. సమస్య తీరదు. కానీ ఆ చెప్పుకునే వ్యక్తులే లేకపోతే..
Krishna Kowshik
సరదాగా నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉన్నంత మాత్రాన వారు సంతోషంగా ఉన్నట్లు కాదు. జీవితంలోని కష్ట నష్టాలు అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. చాలా మంది మన మధ్యన ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉంటారు. కానీ ,అంతరంగంలో కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లుగా నలిగిపోతుంటారు. దానికి కారణం ‘డిప్రెషన్’. ఇదొక మానసిక రుగ్మత. మనకి తెలియకుండానే ఎన్నోసార్లు మనం డిప్రెషన్ కు గురి అవుతూ ఉంటాం. కానీ దానిని గుర్తించలేకపోతాం. అలా డిప్రెషన్ కు గురి అవ్వడానికి గల కారణం మానసిక ఆందోళన. ఒకే విషయం పైన అతిగా ఆలోచించడం, అతిగా బాధపడడం వలన ఇలాంటి పరిస్థితులకు గురి అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోడానికి కూడా వెనుకాడరు. సినీ పరిశ్రమలో అయితే ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వింటూనే ఉంటాం.
తమిళ యాంకర్, నటి స్వర్ణమల్య కూడా ఆ కోవకే చెందుతుంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను చూశాను అంటూ.. తన వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చింది. ‘నేను 12 వ తరగతి చదువుతున్నపుడు యూత్ ఇన్నోవేషన్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అపుడు కొంత బెరుకు ఉండేది. నిజానికి నేను ఎప్పుడు నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాను. నాకు యుక్త వయసులోనే పెళ్లి చేశారు. కానీ అది ఎంతో కాలం నిలువలేదు. 21 ఏళ్లకే విడాకులు అయిపోయాయి. అప్పుడు అతని వయసు 25. ఆ వయసులో మాకు ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది కూడా పెద్దగా తెలియదు. బహుశా అమెరికా లైఫ్ స్టైల్ నాకు వంటపట్టలేదేమో !’ అని చెప్పారు.
‘ఈ విడాకుల వలన నాకన్నా నా తల్లి తండ్రులు ఎక్కువ బాధపడ్డారు. చదువులపై ద్యాస పెడితే ఈ బాధ నుంచి బయటపడొచ్చన్నారు. ఈ బ్రేకప్ కొట్లాట్ల వలన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. జీవితం అంటే ఇదేనా ? ఎందుకు బ్రతకాలి ? అని విరక్తి చెందాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పరిస్థితి చూడలేక నా సోదరి నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. డిప్రెషన్ నుంచి బయటపడానికి నాకు రెండు నెలలు పట్టింది’. అని చెప్పుకొచ్చింది స్వర్ణమల్య. కాగా యాంకర్ గా , నటిగా, నర్తకిగా ప్రేక్షకులను అలరించింది ఈమె.
టెలివిజన్‌లో ఆమె మొదటి ప్రధాన పాత్ర సన్ టీవీ షో ఇలమై పుధుమైలో మరియు తరువాత తమిళ భాషలో అనేక చిత్రాలను చేసింది . అయితే ప్రస్తుతం ఈమె సాధారణ జీవితం గడుపుతోంది. జీవితంలోని ఆటుపోట్లను తట్టుకుని స్వర్ణమల్య దైర్యంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఏదేమైనా డిప్రెషన్ కు గురి అయిన ఏ ఒక్కరికైనా ఆత్మహత్య సమాధానం కాదని ఈమె లైఫ్ జర్నీ చెప్పకనే చెప్తుంది. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిజేయండి.