iDreamPost
android-app
ios-app

స్టూడెంట్ జ్ఞాపకాలు మరోసారి

  • Published Sep 12, 2021 | 5:21 AM Updated Updated Sep 12, 2021 | 5:21 AM
  • Published Sep 12, 2021 | 5:21 AMUpdated Sep 12, 2021 | 5:21 AM
స్టూడెంట్ జ్ఞాపకాలు మరోసారి

ఆర్ఆర్ఆర్ ఒప్పుకున్నప్పటి నుంచి మూడేళ్లుగా తెరమీద దర్శనం లేకుండా పోయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగం పెంచాలని అభిమానులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఎదురుచూసే కొద్దీ లేట్ అవుతుండటంతో ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షో ద్వారా తమ హీరోని చూసుకుని సంతృప్తి పడుతున్నారు. నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయట. ఆచార్య ఇంకో రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉండటంతో అవి షూట్ కు వెళ్ళేలోపు శివ దీని తాలూకు రచనలో బిజీగా ఉన్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నారు. క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, విద్యార్ధిగా కనిపించాల్సిన లుక్ కోసం తారక్ ప్రత్యేకంగా మేకోవర్ కూడా అవుతున్నాడని అంటున్నారు. అప్పుడెప్పుడో నాగలో ఇలాంటి పాత్ర చేసిన జూనియర్ కి దాని ఫలితం అంతగా కలిసి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలా కనిపించడం అంటే కిక్కేగా. కెరీర్ లో మొదటి బ్రేక్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తాలూకు జ్ఞాపకాలు ఇంకా ప్రేక్షకుల మదిలో ఉన్నాయి. కాలేజీ బ్యాక్ డ్రాప్ మాత్రమే కాక ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని తెలిసింది.

కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా సందేశం మాత్రం ఉంటుంది. ఇందులో కూడా వాటిని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేయబోతున్నారట. పాన్ ఇండియా అని ముందే చెప్పేశారు కాబట్టి అన్ని బాషా ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా సినిమా ఉంటుందని అంటున్నారు. కొరటాల తర్వాత జూనియర్ ఎవరికి కమిటయ్యారు అనేది ఇంకా బయటికి రావడం లేదు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు అన్నారు కానీ దాని తాలూకు ఎలాంటి న్యూస్ రావడం లేదు. అతను కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన జాప్యాన్ని జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో గట్టిగానే పూడ్చుకోవాలి మరి

Also Read : 24 తర్వాత సినిమాలు క్యూ కడతాయా

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetCasibomHoliganbetHoliganbetcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetjojobetJojobetcasibomjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio