అమెరికా శాంతి మంత్రం – లాభాల్లో స్టాక్ మార్కెట్లు

  • Published - 05:06 AM, Thu - 9 January 20
అమెరికా శాంతి మంత్రం – లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్ అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో తీవ్రంగా నష్టపోయిన మార్కెట్లు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో లాభాల బాట పట్టాయి.

ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ఆయిల్ ధరలు కూడా పెరిగాయి. దీంతో దేశంలో కూడా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. బంగారం ధరలు గతంలో లేని విధంగా పెరిగాయి. దీనికి తోడు అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగాయి.

Read Also: ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం తప్పదా?

తాజాగా ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటనలో శాంతి మంత్రం పఠించడంతో మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్లయింది. తమ దేశ సైనికులు చనిపోలేదని ప్రకటించిన ట్రంప్ శాంతి కోరుకునే దేశాలతో సామరస్యపూర్వక సంబంధాలను అమెరికా కోరుకుంటుందని ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం వస్తుందన్న అనుమానాలకు తెరదించినట్లయింది. దాంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్ల లాభంతో 41,264 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 136 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,161 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Show comments