ఇండస్ట్రీలో హీరో సిద్ధార్థ్ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా సిద్ధార్థ్ ని హీరోగా జనాలు చూస్తూనే ఉన్నారు. తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచం ఇష్టం కొంచం కష్టం లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన సిద్ధు.. ఆ తర్వాత కొన్నాళ్ళు తెలుగువైపు రాలేదు. కానీ.. సిద్ధార్థ్ వేరే భాషలో చేసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. చాలకాలంగా సిద్ధార్థ్ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ‘చిన్నా’ అనే సినిమాతో హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గాను రిస్క్ చేశాడు. ఎన్నాళ్ళుగానో తాను ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్న సిద్ధు.. మొత్తానికి చిన్నా(చిత్త) సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.
కొంతకాలంగా సిద్ధార్థ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. వరుస ప్లాప్స్ కారణంగా జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడటం మానేశారని టాక్ ఉంది. ముఖ్యంగా చిన్నా సినిమా రిలీజ్ టైమ్ లో.. చాలామంది కామెంట్ చేశారని స్టేజ్ పై ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్ లో ఇంతకన్నా బెస్ట్ మూవీ చేయలేనని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అందులోనూ ఈ సినిమా తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషలలో సెప్టెంబర్ 28న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం. చేసుకుంది. కానీ.. తెలుగులో మాత్రం సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని థియేటర్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదట. ఆ తర్వాత వారం ఆలస్యంగా అంటే.. అక్టోబర్ 6న తెలుగు రిలీజ్ అయ్యింది.
కట్ చేస్తే.. సినిమా దాదాపు పది సినిమాలకు పోటీగా రిలీజ్ అయ్యింది. కానీ.. ఉన్న వాటిలో మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగాను సినిమా హిట్ కొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ చిన్నా సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతోందని తెలుస్తుంది. ఎస్.యూ. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో.. నిమిష సజయన్, సహస్ర శ్రీ అంజలి నాయర్ కీలకపాత్రలు పోషించారు. ఇక సినిమా స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. ప్రముఖ హాట్ స్టార్ ఓటిటి వారు చిన్నా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నారు. సినిమాని అక్టోబర్ నెలాఖరులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికైతే చిన్నా ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. మరి దసరాకు ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. చిన్నా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.