పాకిస్థాన్ క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాక్ మాజీ క్రికెటర్ చెల్లెలు మంగళవారం తుదిశ్వాస విడిచారు. చెల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రి ట్వీట్ చేశాడు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అతడు ఊహించి ఉండడు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి చెల్లెలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. అయితే గత రాత్రే చెల్లిని చూడటానికి వెళ్తున్నానని, ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు అఫ్రిదీ. కానీ ఇంతలోనే విషాదం నెలకొంది. అతడు ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అఫ్రిదీ కుటుంబాన్ని శోకసంద్రలో నింపింది. ఈ విషయం తెలిసిన ప్రముఖులు అఫ్రిదీకి సానుభూతి తెలియజేస్తున్నారు.
Shahid Afridi’s sister passes away after brief illness pic.twitter.com/kzkPytW9Zi
— Kashmir News Trust༝ (@knewstrust) October 17, 2023