Etela Rajendar, Ravinder singh, TRS – ఈట‌ల‌కు కేసీఆర్ ఝ‌ల‌క్‌..!

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ప‌ట్టు బిగిస్తున్నారు. బీజేపీ దూకుడు కు క‌ళ్లెం వేసేలా త‌న మార్క్ వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు షాక్ ఇచ్చేలా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ స్కెచ్ వేశారు. కానీ.. అది పార‌లేదు. ఇప్పుడు కేసీఆర్ ఈట‌ల‌కు షాక్ ఇచ్చారు. ఆయన అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసిన ర‌వీంద‌ర్ సింగ్, రెబల్స్ ను గాడిలో పెడుతున్నారు గులాబీ బాస్. మరి రానున్న రోజుల్లో మ‌రికొంద‌రికి ఇదే ర‌క‌మైన పిలుపు ఉంటుందా..? ర‌వీంద‌ర్ సింగ్ క‌లయికతో ఈటెల శిబిరంలో అలజడి మొదలయిందా.? అనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్ గా పోటీలో దిగి హాట్ టాపిక్ అయ్యారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. కానీ ఎన్నికల్లో గెలవలేక పోయారు. ఫలితాల తర్వాత కూడా పార్టీ నాయకులపై ఘాటుగానే మాట్లాడారు. ఇంకేం ఈటెల రాజేందర్ నాయకత్వంలో బీజేపీ గూటిలో చేరుతారని అతా భావించారు. కానీ, సరిగ్గా గులాబి బాస్ కేసీఆర్ ఇక్కడే తన వ్యూహంతో చక్రం తిప్పారు. కేసీఆర్ ఒక్క పిలుపుతో తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు రవీందర్ సింగ్. సీఎంను కలిసి ఈటెల రాజేందర్ శిబిరంలో అలజడి రేపారు.

రవింద్ సింగ్ కు పిలుపు అందినట్టే ఈ మధ్యకాలంలో ఈటెల రాజేందర్‌తో పాటు పార్టీని వదిలిన నేతలకు, వేరే పార్టీల వైపు చూస్తున్న నేతలకు కేసీఆర్ ఆహ్వానం ఉంటుంది అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తో వెళ్లిన తులా ఉమా, ఏనుగు రవింద్ రెడ్డి లకు పిలుపు వస్తే పోకుండా ఉంటారా అనే టాక్ నడుస్తోంది. ఉప ఎన్నిక సమయంలోనూ హుజురాబాద్ నేత సమ్మిరెడ్డి ఈటెల రాజేందర్ గూటి నుండి తిరిగి టిఆర్‌ఎస్ కు వచ్చిన సీన్ చూసిందే. ఈటెల బీజేపీలో జాయిన్ అయ్యాక టిఆర్ఎస్ లోని ఒకప్పటి తన పాత మిత్రులందరిని కలుస్తున్నారు. వారందరిపై గులాబీ బాస్ ఒక కన్నేసినట్టు సమాచారం. టిఆర్ఎస్ లో అవకాశాలు లేక ఎదురుచూస్తు అసంతృప్తితో ఉన్న నేతలను ఈటెల రాజేందర్ టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ రివర్స్ ప్లాన్ లో వెళ్తూ ఈటెల కు ఝలక్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక మెల్లిగా మాజీ మంత్రిని కేసీఆర్ ఒంటరి చేస్తారు అని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ముందు ముందు ఇంకేం జరుగుతోందో చూడాలి.

Show comments