స్కూల్స్ క్లోజ్ చేయొద్దు, ఓపెన్ చేయండి: సిఎం ఆదేశం

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు దాదాపుగా నెలరోజుల నుంచి సెలవులు ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలతో కరోనా కేసులు కట్టడి కావడంతో… విద్యా సంస్థలను ఓపెన్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

రేపటితో తెలంగాణ విద్యా సంస్థలకు సెలవులు ముగియనున్నాయి. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని… విద్యార్థుల తల్లిదండ్రులకు కరోనా మీద పూర్తి అవగాహన కల్పించడమే కాకుండా విద్యార్థులందరూ స్కూల్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ మందులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడమే కాకుండా తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కూడా స్పష్టం చేసింది.

తెలంగాణలో ఏ ఒక్క జిల్లాలో కూడా పది శాతం కేసులు దాటకపోవడంతో నైట్ కర్ఫ్యూ గాని మరొక నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఇప్పటికే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం దృష్టిలో పెట్టుకుని స్కూల్స్ కి సెలవులు లేకుండా ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మీద వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సూచించింది.

అయితే రెండేళ్ళ నుంచి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని తల్లిదండ్రులు కూడా అంటున్నారు. మరోవైపు కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించినా సరే ఏపీ సిఎం వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. స్కూల్స్ కి సెలవలు ఇచ్చేదిలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే కేసులు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. దీనిపై తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

Also Read : కొత్త సార‌థులు “కారు” స్పీడు పెంచేనా?

Show comments