సీనియర్ సినీనటి, మాజీ ఎంపీ జయప్రదపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2019లోనే జయప్రదపై కేసు స్వార్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యిందట. అనంతరం వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించినా.. జయప్రద హాజరు కాలేదట. దీంతో ఇప్పుడు రాంపూర్ కోర్టు జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
2019 ఎన్నికలలో రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన జయప్రద.. సమాజ్ వాది పార్టీ కాండిడేట్ అజాం ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఇక ఈ ఏడాది ఆగష్టులో చెన్నై ఎగ్మోర్ కోర్టు.. జయప్రదకు ఆరు నెలల శిక్ష విధించింది. జయప్రదతో పాటు అదే శిక్షను మరో ముగ్గురిపై అమలు చేయడమే కాకుండా.. ఒక్కొక్కరిపై ఐదు వేల రూపాయలు జరిమానా విధించింది. గతంలో చెన్నైలోని రాయంపేటలో ఓ సినిమా థియేటర్ రన్ చేశారు జయప్రద. ఆమెతో పాటు రామ్ కుమార్, రాజబాబు ఆ థియేటర్ ని చూసుకునేవారు. మొదట్లో లాభాలు చూసినప్పటికి.. తర్వాత బిజినెస్ పడిపోయి నష్టాలు వచ్చాయి. దాంతో థియేటర్ ని మూసేశారు.
ఈ క్రమంలో.. థియేటర్ కార్మికుల నుండి ఈఎస్ఐ వసూల్ చేశారట థియేటర్ సిబ్బంది. థియేటర్ మూసిన తర్వాత కూడా ఈఎస్ఐ డబ్బులు కార్మికులకు రిటర్న్ చేయకపోవడంతో.. కార్మికులు భీమా కార్పొరేషన్ ని ఆశ్రయించారట. దీంతో సదరు భీమా సంస్థ.. చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించగా.. కార్మికులకు ఈఎస్ఐ డబ్బులు తిరిగి చెల్లించలేదని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత.. మద్రాస్ హైకోర్టు జయప్రద తరపున పిటిషన్స్ ని కొట్టివేసింది. ఆ తర్వాత జయప్రద.. ఆ డబ్బును కార్మికులకు చెల్లిస్తామని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. అనంతరం.. ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మిగతా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 5000 జరిమానా వేసింది. మరి జయప్రద కేసు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.