iDreamPost
iDreamPost
ఇక్కడ విడుదలైన ఏడాది తర్వాత రష్యాలో పుష్ప 1ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసమే ప్రత్యేకంగా అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇలా క్రూలో ఉన్న ముఖ్య సభ్యులంతా అదే పనిగా వీలు చేసుకుని మరీ అక్కడికి వెళ్లిపోయారు. విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. మాములుగా అక్కడ ఇండియన్ మూవీస్ అంతగా ఆడవు. పెద్దగా ట్రాక్ రికార్డులు ఏమి లేవు. పైగా అక్కడి ఎంటర్ టైన్మెంట్ విషయంలో ప్రభుత్వం తరఫున కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందుకే నార్కోటిక్స్ లాంటి డెంజరస్ వెబ్ సిరీస్ లను రష్యాలో స్ట్రీమింగ్ చేయడానికి అనుమతి లేదు. అందుకే పుష్ప ఆడుతుందనే నమ్మకం టీమ్ కి.
ఈ పబ్లిసిటీకి గాను అక్షరాలా అయిదు కోట్ల దాకా ఖర్చయ్యిందని ఫిలిం నగర్ టాక్. ఎప్పుడో సంవత్సరం క్రితం వచ్చిన సినిమాను మళ్ళీ ఇన్ని సొమ్ములు ధారపోయడం అంటే నిర్మాతకు భారమే. పైగా రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయన్న గ్యారెంటీ లేదు. అక్కడి మీడియా ఎంత మద్దతు ఇచ్చినా రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా జనం మెచ్చుకోవడం కీలకం. కానీ దీని వెనుక అసలు ప్లాన్ వేరే ఉందట. పుష్ప 2కి వరల్డ్ వైడ్ చాలా పెద్ద మొత్తం గుర్తింపు తీసుకురావాలనేది బన్నీ ప్లాన్. ఎలాగూ నార్త్ లో విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. హిందీ హక్కులకు ఎక్కడ లేని పోటీ నెలకొంది. అందుకే పుష్ప బ్రాండ్ ని మరింత బలంగా ఎస్టాబ్లిక్ చేసే ప్రయత్నమే ఇదంతా.
పుష్ప 2 కొత్త షెడ్యూల్ డిసెంబర్ 12 నుంచి పది రోజుల పాటు హైదరాబాద్ లో జరగనుందని సమాచారం. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి అడవి ఎపిసోడ్స్ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నారు. చూస్తుంటే పుష్ప 2 వచ్చే ఏడాది విడుదల కావడం అనుమానంగానే ఉంది. 2024 సంక్రాంతి లేదా ఆ ఏడాది వేసవిని టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఎలాగూ ఇంకా కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి బన్నీకి బోలెడు టైం ఉంది. తర్వాత వరసలో త్రివిక్రమ్ శ్రీనివాస్, మురుగదాస్ ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ప్రస్తుతానికి కథా చర్చల దశలోనే ఉన్నాయి కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. ఫాహద్ ఫాసిల్ డేట్లు ఏ నెలలో దొరుకుతాయనే దాన్ని బట్టి పుష్ప 2 ప్లానింగ్ ఉంటుంది