Venkateswarlu
Venkateswarlu
వచ్చే నెలలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు అనుమానం వచ్చిన వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా నగదు పట్టుబడుతోంది. మొన్నీ మధ్య హైదరాబాద్‌లో 27 కిలోల బంగారంతో పాటు 14 కిలోల వెండి పట్టుబడింది. వాహనంలో తరలిస్తున్న డబ్బును అధికారుల స్వాధీనం చేసుకున్నారు.
ఇక, నల్గొండలో పోలీస్‌లు ఓ కారును ఛేజ్ చేసి 3 కోట్ల రూపాయల నగదును పట్టుకున్నారు. తాజాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి దగ్గరినుంచి ఏకంగా 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని మెహదీపట్నంలోని మేరాజ్ హోటల్ క్రాస్ రోడ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. పోలీసులకు అతడిపై ఎందుకో అనుమానం వచ్చింది.
అతడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. నగలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవటంతో వాటిని సీజ్ చేశారు. అనంతరం వాటిని నాంపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. కాగా, అతడి పేరు జనార్థన్‌గా తెలిసింది. కాటేదాన్ బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు వెల్లడైంది. సరైన పత్రాలు లేనిదే ఎవ్వరూ నగదు తరలించే ప్రయత్నం చేయోద్దని పోలీసులు తెలిపారు. మరి, నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి దగ్గర 30 లక్షలు దొరకటంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.