Best Survival Thriller In OTT: క్షణ క్షణం ఉత్కంఠ భరింతగా సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను చూశారా! ఏ OTT లో ఉందంటే !

OTT Movie Suggestion: ఎప్పటికప్పుడు ఓటీటీ లోకి ఫ్రెష్ కంటెంట్ వచ్చినా కూడా.. ప్రేక్షకులు ఇంకా బెస్ట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఇప్పుడు చెప్పుకొబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఎప్పటికప్పుడు ఓటీటీ లోకి ఫ్రెష్ కంటెంట్ వచ్చినా కూడా.. ప్రేక్షకులు ఇంకా బెస్ట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. మరి ఇప్పుడు చెప్పుకొబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

గత కొద్దీ నెలలుగా చూస్తున్నట్లైతే ప్రతి రోజు ఓటీటీ లో ఎదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు ఆయా సినిమాలను చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న కొన్ని సినిమాలను మిస్ చేసేస్తూ. ఇంకా ఏమైనా మంచి కంటెంట్ ఉందేమో అని సెర్చ్ చేసేస్తూ ఉన్నారు. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పటివరకు ఓటీటీ లో ఎన్నో సర్వైవల్ థ్రిల్లర్స్ ను చూసి ఉంటారు. కానీ ఈ సినిమా కాస్త డిఫ్ఫరెంట్. ముఖ్యంగా మంజుమ్మేల్ బాయ్స్ తర్వాత సర్వైవల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడుతూ చూస్తున్న ప్రేక్షకుల కోసం ఈ మూవీ సజ్జెషన్. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో.. ఒక వేళ మిస్ అయితే అది ఏ ప్లాట్ ఫార్మ్ లో ఉందో.. ఇంతకు అసలు ఇది ఏ సినిమానో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. శౌర్య అనే వ్యక్తి ఓ సాఫ్ట్ వేర్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అదే ఆఫీస్ లో తనకు నూరి అనే ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండడంతో.. ఓ రోజు శౌర్య.. నూరిని తన రూమ్ కి తీసుకుని వెళ్తాడు. కాని ఆ రూమ్ లో తన రూమ్ మేట్స్ చాలా మంది ఉంటారు. అందరి బ్యాచిలర్స్ రూమ్ లానే ఉంటుంది శౌర్య రూమ్ కూడా. నూరికి ఆ ఫ్లాట్ నచ్చకపోడంతో.. తనకంటూ సొంతంగా ఓ ఫ్లాట్ ను కొనుక్కోమని చెప్తుంది నూరి, దీనితో శౌర్య ప్లాట్ వెతికే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో ఓ బ్రోకర్ ద్వారా సగం కట్టి వదిలేసిన అపార్ట్మెంట్ లోని 25వ ఫ్లోర్ లో ఉండే ఓ ఫ్లాట్ చూపిస్తాడు. ఆ అపార్ట్మెంట్ మొత్తం మీద కేవలం రెండే కుటుంబాలు ఉంటాయి. దీనితో శౌర్యకు ఆ ఫ్లాట్ నచ్చడంతో వెంటనే రూమ్ కి వెళ్లి తన సామానం అంత తెచ్చుకుని.. కొత్త ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవుతాడు. అసలు కథ అప్పుడు మొదలవుతుంది .

తానూ వెళ్లిన అపార్ట్మెంట్ కంస్ట్రక్షన్ ఇంకా పూర్తి కాకపోడంతో.. ఆ ఫ్లాట్ లోకి నీళ్లు, కరెంటు ఏమి ఉండవు. అయినా సరే.. ముందు ఆఫీస్ కు వెళ్లి వద్దాం అని.. ఫ్లాట్ కు లాక్ వేసి ఆఫీస్ కు బయల్దేరతాడు శౌర్య. కానీ తన ఫోన్ లోపలే ఉన్న సంగతి గుర్తొచ్చి లాక్ తీసి లోనికి వెళ్తాడు. అయితే ఆ రూమ్ కీస్ ను మాత్రం బయటే వదిలేస్తాడు. తాను లోనికి వచ్చిన క్రమంలో గాలి బాగా రావడంతో ఆ గాలికి డోర్ లాక్ అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో తన ఫోన్ లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఆ సమయంలో శౌర్యకు ఏం చేయాలో తెలియక కోపంతో ఫోన్ పగలకొట్టేస్తాడు. 25వ ఫ్లోర్ లో ఉండడంతో తన అరుపులు కూడా ఎవరికీ వినిపించవు. అక్కడ నీళ్లు, కరెంటు , ఆహరం ఏమి లభించదు. దీనితో కొన్ని రోజులకు తన ఫ్లాట్ దగ్గరకు వచ్చే పావురాలను, చీమలను , బొద్దింకలను కూడా తినడం ప్రారంభిస్తాడు. ఆ 25 వ ఫ్లోర్ నుంచి అతను బయటపడగలిగాడా లేదా ! అతనికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ! చివరికి కథ ఎలా ముగిసింది! ఇవన్నీ తెలియాలంటే “ట్రాప్డ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments