పొద్దున్నే ఇలా అనిపిస్తోందా? అయితే, ప్రమాదమే..

రాత్రి బాగా మందు కొట్టినపుడు.. ఉదయం నిద్రలేవగానే తల మొత్తం పట్టేసినట్లు అవుతుంది. దీన్నే హ్యాంగోవర్‌ అంటారు. ఈ హ్యాంగోవర్‌ తాగినపుడు మాత్రమే వస్తుంది. అయితే, కొంతమందికి తాగకపోయినా.. తాగుడు అలవాటు లేకపోయినా తరచుగా.. ఉదయం తలపట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా తరచుగా ఉదయం పూట తల పట్టేసినట్లు అనిపించటం ప్రమాదానికి సంకేతమని గుర్తించాలి. మైనింజైటిస్‌ అనే ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్‌ లక్షణాల్లో ఇది కూడా ఒకటట. మెచ్యూరిటీ లెవల్స్‌ అంతగా లేని నిబ్బా, నిబ్బీలకు ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందట. ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినపుడు సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అది కూడా 24 గంటల్లోనే ప్రాణాలు పోతాయట.

ఇంతకీ ఏంటీ మైనింజైటిస్‌ ?

మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల్లో వచ్చే ఇన్‌ఫెక్షనే ఈ మైనింజైటిస్‌. ఇది చాలా అరుదుగా వచ్చే ఇన్‌ఫెక్షన్‌. ఇది రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వైరస్‌ ద్వారా.. మరికొన్ని సార్లు బ్యాక్టీరియా ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. మైనింజైటిస్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా లేదా మందుల కారణంగా.. రోగాల కారణంగా కూడా వస్తుంది. తాకటం, ముద్దులు పెట్టుకోవటం, దగ్గు, తుమ్మటం వల్ల ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ఇది త్వరగా వ్యాపిస్తుంది.

మైనింజైటిస్‌ లక్షణాలు!

  • జ్వరం
  • శరీరంలో సత్తువ లేకపోవటం.
  • చిరాకు.
  • తలనొప్పి.
  • ఎండ తగిలినపుడు శరీరం ఇబ్బంది పడ్డం.
  • గొంతు బిగుసుకుపోవటం.

ఈ ఇన్‌ఫెక్షన్‌ కాలేజీ స్కూలు, కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువగా వస్తుంటుంది. దీని లక్షణాలు గనుక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు వెన్నెముకలోని పదార్ధాలను బయటకు తీసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తారు. అంతేకాదు! రక్త పరీక్షలు కూడా చేయిస్తారు. సాధారణంగా వైరల్‌ మైనింజైటిస్‌ 7 నుంచి 10 రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రం ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మరి, నిబ్బా, నిబ్బీలకు ప్రమాదకరంగా మారిన మైనింజైటిస్‌పై  మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments