Tollywood Heroine: ఇన్నాళ్లు ఎంపీగా వెలిగిపోయిన ఈ నటిని.. ఇక పార్లమెంట్‌లో చూడలేరు!

ఇన్నాళ్లు ఎంపీగా వెలిగిపోయిన ఈ నటిని.. ఇక పార్లమెంట్‌లో చూడలేరు!

లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సినీ ప్రముఖులు కూడా పోటీ చేశారు. కొంత మంది గెలిస్తే.. మరికొంత మంది ఓడిపోయారు. వారిలో ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ కూడా ఒకరు

లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో సినీ ప్రముఖులు కూడా పోటీ చేశారు. కొంత మంది గెలిస్తే.. మరికొంత మంది ఓడిపోయారు. వారిలో ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ కూడా ఒకరు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ నెల 4న వాటి ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచిన వాళ్లకు ఆనందం, ఓడిపోయిన వాళ్లకు నిర్వేదం. ఈ సారి ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూడా సత్తా చాటిన సంగతి విదితమే. ఇందులో కూడా కొంత మంది గెలవగా, మరికొంత మంది ఓడిపోయారు. సురేష్ గోపీ, రవికిషన్, మనోజ్ తివారీ, హేమమాలిని,శతృఘ్న సిన్హా, అరుణ్ గోవిల్, కంగనా రనౌత్, రచనా బెనర్జీ, విజయ్ వసంత్ గెలిచారు. అలాగే  రాధిక,స్మృతి ఇరానీతో పాటు శివరాజ్ కుమార్ సతీమణి గీతా ఓడిపోయారు. వీరి ఖాతాలోకి చేరింది ఓ తెలుగు నటి. ఆమెనే నవనీత్ కౌర్.

శ్రీను, వాసంతి, లక్ష్మీతో పరిచయమైన బ్యూటీ నవనీత్ కౌర్. ఇందులో లక్ష్మీ పాత్రలో డీ గ్లామర్ పాత్రలో మెప్పించింది ఈ ముంబయి భామ. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరో దర్శన్ టైటిల్ రోల్ పోషించిన మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో శత్రువు, జగపతి, గుడ్ బాయ్, రూమ్మేట్స్, మహారధి బంగారు కొండ, జాబిలమ్మ, టెర్రర్ వంటి చిత్రాల్లో నటించింది. గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. యమదొంగలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఓ పాటలో ఆడిపాడింది. అందులో రంభ పాత్రను పోషించింది ఈ బ్యూటీనే. ఫ్లాష్ న్యూస్, నిర్ణయం, కాలచక్రం వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో లేదో కూడా తెలియదు. అటు పంజాబీ, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది.

ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో 2011లో మహారాష్ట్రలోని అమరావతి సిటీ మంద్రే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రవిరాణాను వివాహం చేసుకుంది. అలా ఆమె కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. 2014లో లోక్ సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి ఓడిపోయింది. 2019లో లోక్ సభ ఎన్నికల్లో అమరావతి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాక తన గళాన్ని వినిపించింది. పలుమార్లు తెలుగులో మాట్లాడుతూ.. ఆశ్చర్యానికి గురి చేసింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజెపీలోకి చేరింది నవనీత్ కౌర్. అదే నియోజక వర్గం నుండి పోటీకి దిగింది. కానీ ఆమెపై కాంగ్రెస్ బల్వంత్ బస్వంత్‌ను నిలబెట్టింది. ఈ క్రమంలో ప్రచారంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జై శ్రీరామ్ అనడం ఇష్టం లేని వాళ్లు పాకిస్తాన్ వెళ్లొచ్చు అంటూ వ్యాఖ్యానించింది. చివరకు ఆమెను ఓడగొట్టారు అమరావతి ప్రజలు. నవనీత్ రవి రాణా 19,731 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.

Show comments