Idream media
Idream media
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పలు చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో ఈ చిత్ర విచిత్రాలు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా వస్తున్నా హిందూపురం మున్సిపాలిటీ వైసిపి కైవసం అయ్యింది. దీనికి తోడు ఈ మున్సిపాలిటీలో ఒకరికి కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మందికి ఒక్కఓటు కూడా పడలేదు. వారంత తమ ఓటును కూడా వేసుకోలేకపోవడం గమనార్హం.
రెండో వార్డులో పోటీ చేసిన గంగాధర్, 3వ వార్డులో పోటీ చేసిన షాతాజ్ బాను, 5వ వార్డులో షానూర్ బాషా, 14వ వార్డులో గోవింద రెడ్డి, 16వ వార్డులో గులాబ్ జాన్, 17వ వార్డులో గౌతమి, 26వ వార్డులో సమీవుల్లా, 29వ వార్డులో నజీర్ అహ్మద్ కు ఒక్క ఓటు కూడా పోలవలేదు. హిందూపురంలోనే నలుగురికి ఒకే ఓటు పోలైంది. అలాగే మడకశిర నగరపంచాయతీలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన చక్రపాణి అనే అభ్యర్థికి కూడా ఒక్క ఓటు కూడా పోలవలేదు.
ఆత్మకూరు లో కూడా ఇదే పరిస్థితి
కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 6వ వార్డులో పోటీ చేసిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ఓటు తమకు కూడా వేసుకోలేదు. ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన మొమిన్ జకియా, అలీమున్ షేక్ కు సున్నా ఓట్లు పడ్డాయి. వీరి ఓట్లు కూడా పక్కవారికి వేశారు.
Also Read : టీడీపీ తిరోగమానానికి ఫలితాలు ఓ సూచి!
నామమాత్రంగానే బరిలోకి..
ఒక్క ఓటు కూడా పడని అభ్యర్థులందరూ నామమాత్రంగానే బరిలో నిలిచారు. వీరంతా ఇండిపెండెంట్ ఇలానే పోటీలో నిలిచిన ఎన్నికల సమయం దగ్గర పడే సరికి వివిధ పార్టీల నేతలకు మద్దతుగా నిలిచారు. ఓటు మద్దతుగా నిలిచిన వారికి వేయాలని ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అందుకే కూడా వేసుకోకుండా తాము మద్దతు ఇచ్చిన వారికే వేశారు.
డమ్మీ లతోనే..
ఒక్క ఓటు కూడా దాఖలు కానీ అభ్యర్థుల్లో చాలామంది డమ్మిలే ఉన్నారు. వారంతా నామినేషన్ ఉపసంహరణ సమయంలో అధికారుల వద్దకు రాక పోవడంతో వారిని అభ్యర్థులుగా అధికారులు ప్రకటించారు. దీంతో వారే అభ్యర్థిగా నిలిచారు అధికారులు కూడా వారికి గుర్తులను కేటాయించారు. అయితే వారు తమ ఓటును మాత్రం వేరే పార్టీలకు వేసినట్లు తెలుస్తోంది.
Also Read : మున్సిపల్ ఎన్నికలు.. నాడు– నేడు