Uppula Naresh
Uppula Naresh
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అందరూ ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రైవేట్ కార్యాలయాల వరకు అధికారులంతా స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా ఓ చోట ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ మంత్రి జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి రైసెన్ ప్రాంతంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆయన జెండా అవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడారు. అలా ఆయన మాట్లాడుతుండగా ఉన్నట్టుండి అస్వస్థతకు లోనై స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు మంత్రి ప్రభురామ్ చౌదరిని అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) August 15, 2023
ఇది కూడా చదవండి: పవన్ కామెంట్స్ పై అంబటి సీరియస్.. వాళ్లే దండుపాళ్యం బ్యాచ్!