Whatsapp: యూజర్లకు షాక్‌.. 75 లక్షల అకౌంట్లు బ్యాన్‌ చేసిన వాట్సాప్‌!

మెటా కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కొన్ని అకౌంట్లను బ్యాన్‌ చేయడానికి నిశ్చయించుకుంది. యూజర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాటిని తొలగిస్తోంది...

మెటా కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కొన్ని అకౌంట్లను బ్యాన్‌ చేయడానికి నిశ్చయించుకుంది. యూజర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాటిని తొలగిస్తోంది...

వాట్సాప్.. ప్రస్తుత సమాజంలో ఇది కూడా ఓ నిత్యావసరం అయిపోయింది. సెల్‌ఫోన్‌ వాడే వారి జీవితంలో ఓ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ వాడుతూ ఉన్నారు. మెటా కంపెనీ ఈ మెసేజింగ్ ప్లాట్ ఫామ్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్స్ ను అందిస్తోంది. తాజాగా, వాట్సాప్ యాజమాన్యం అక్టోబర్ నెల రిపోర్ట్స్ ను ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం 2023 అక్టోబర్1 నుంచి 31వ తేదీల మధ్యలో దాదాపు 75 లక్షల భారతీయుల అకౌంట్స్ ను తొలగించినట్లు తెలిపింది. దానికి గల కారణాలు ఏమై ఉంటాయి !.. రానున్న రోజుల్లో మరిన్ని అకౌంట్స్ ను వాట్సాప్ బ్యాన్ చేయనుందా!.. ఆ వివరాలు తెలుసుకుందాం..

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్ అకౌంట్స్‌ను తొలిగించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నియమాల ప్రకారం.. నకిలీ ఖాతాలను వాట్సాప్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ నెలలో, ఏకంగా 75 లక్షల 48 వేల భారతీయుల వాట్సాప్ అకౌంట్స్ ను బ్యాన్ చేసింది. దానికి కారణం లేకపోలేదు.. కేవలం అక్టోబర్ నెలలో మాత్రమే రికార్డు స్థాయిలో 9వేల పిర్యాదులు నమోదు అయ్యాయని యాజమాన్యం వెల్లడించింది.

అందులో 4వేల పిర్యాదులు పలు ఖాతాలను బ్యాన్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సమాచారం అందించింది. గత నెల బ్యాన్ చేసిన మొత్తం ఖాతాల్లో 19 లక్షల 19 వేల మంది వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బ్యాన్ చేసినట్టు వివరాల్లో వెల్లడించింది. ఇక 2021లో నిర్ణయించిన విధంగా భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను అమలులోకి తీసుకుని వచ్చింది. దీనితో అప్పటినుంచి ఫేక్ అకౌంట్స్, స్పామ్ అకౌంట్స్ రూపొందిస్తున్న వారికీ వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

ఇక వాట్సాప్ వెల్లడించిన వివరాల ప్రకారం వినియోగదారులు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అప్పుడు వచ్చిన ఫిర్యాదులలో అకౌంట్ సపోర్ట్, బ్యాన్ అప్పీల్, సేఫ్టీ వంటి వర్గాలలో.. యూజర్స్ నివేదికను సేకరించినట్లు సమాచారం. కాగా, అంతకముందు సెప్టెంబర్ నెలలోను భారీగానే భారతీయుల అకౌంట్స్ ను బ్యాన్ చేసింది వాట్సాప్. మొత్తంగా 71 లక్షల 11 వేల నకిలీ ఖాతాలను తొలగించింది. వినియోగదారులు భద్రతను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మరి, మెటా యాజమాన్యం తీసుకున్న వాట్సాప్ ఫేక్ అకౌంట్స్ బ్యానింగ్ నిర్ణయంపై.. మీ అభిప్రయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments