అర్ధం చేసుకోకుండా అంత మాట అనేస్తారా.. మెహరీన్ ఆవేదన!

  • Author ajaykrishna Updated - 04:40 PM, Tue - 17 October 23
  • Author ajaykrishna Updated - 04:40 PM, Tue - 17 October 23
అర్ధం చేసుకోకుండా అంత మాట అనేస్తారా.. మెహరీన్ ఆవేదన!

ఇండస్ట్రీలో క్రేజ్ బాగున్నప్పుడు సినిమా అవకాశాలు.. క్రేజ్ తగ్గినప్పుడు ఓటిటి అవకాశాలు అన్నట్లుగా మారింది యాక్టర్స్ పరిస్థితి. ఓటిటిలు వచ్చాక ఓ విధంగా ఉపాధి పెరిగిందని అనుకున్నా.. సినిమాల పరంగా చాలా మార్పులు వచ్చేశాయి. ఇదివరకు సినిమాలపైనే ఆశలు పెట్టుకొని ప్రయత్నాలు చేసే రోజులు కనిపించడం లేదు. ఓటిటిలో అవకాశం దొరికినా వెళ్లిపోతున్నారు. టాలీవుడ్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మెహరీన్. కృష్ణగాడి వీరప్రేమగాధ, ఎఫ్2, రాజా ది గ్రేట్, మహానుభావుడు లాంటి సూపర్ హిట్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్.. కొన్నాళ్ళుగా ఫామ్ లో లేని సంగతి తెలిసిందే.

గతేడాది ‘ఎఫ్ 3’లో మెరిసిన ఈ భామ.. మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కట్ చేస్తే.. తాజాగా ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో డెబ్యూ చేసింది. ఆ సిరీస్ లో మెహరీన్ కాస్త హద్దులు చెరిపేసి రొమాంటిక్ సన్నివేశాలు చేసింది. దీంతో ఆ సీన్స్ కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఫేస్ చేస్తోంది అమ్మడు. ఈ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ తో పాటు లిప్ కిస్ సీన్స్ లో కూడా రెచ్చిపోయింది. ఆ విషయంలో నెటిజన్స్ మెహరీన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. సె*క్స్ సీన్స్.. అంటూ కామెంట్స్ చేయడంతో ఆమె రియాక్ట్ అయ్యింది. తన సోషల్ మీడియా ఖాతాలో వివరంగా ట్రోల్స్ పై స్పందించింది. ఆ సీన్స్ పబ్లిక్ కి ఇబ్బందిగా అనిపించినా.. ఒక నటిగా తాను కథానుసారంగా సీన్స్ లో నటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.

మెహరీన్ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. “నేను సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ చేశాను. నా ఫ్యాన్స్ ఆ సిరీస్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. కొన్నిసార్లు స్క్రిప్ట్ మన నైతిక విలువలకు విరుద్ధంగా.. చర్యలను డిమాండ్ చేయవచ్చు. అలాంటి టైమ్ లో యాక్టింగ్ ని ప్రధానంగా తీసుకొని.. యాక్టింగ్ నే వృత్తిగా భావించి.. కథాకథనాలలో అవసరమైన సీన్స్ చేయాల్సి ఉంటుంది. నేను చేసిన వెబ్ సిరీస్ లో.. మెరిటల్ రే*ప్(క్రూరమైన వైవాహిక అత్యాచారం) గురించి సీన్స్ ఉన్నాయి. ఆ సీన్ ని మెరిటల్ రే*ప్ లా కాకుండా మీడియాలో సె*క్స్ సీన్ గా ప్రచారం చేస్తున్నారు. అదే నాకు బాధగా అనిపిస్తుంది. వరల్డ్ వైడ్ లేడీస్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమస్యలలో ఇది ఒకటి. అలాంటి విషయాన్ని ఇలా ట్రోల్ చేయడం షాకింగ్ గా ఉంది.

చాలామంది తమకు కూడా సిస్టర్స్, కూతుర్లు ఉన్నారని అర్ధం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు లైఫ్ లో ఇలాంటి సమస్యలు ఫేస్ చేయొద్దని కోరుకుంటున్నాను. నటిగా ఒక సమస్యను చూపించే క్రమంలో ఆ పాత్రకు న్యాయం చేయాల్సి ఉంటుంది. నేను అదే చేశా అనుకుంటున్నా. మహాలక్ష్మి, సంజన, హనీ.. ఇలా ఆడియన్స్ కోసం ఆర్టిస్ట్ గా ప్రతీ పాత్రలో నా సత్తా చాటాలని ట్రై చేస్తున్నాను.” అని పేర్కొంది. ప్రస్తుతం మెహరీన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో తాను చేసిన రొమాన్స్ సీన్స్ ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఆడియన్స్ మెహరీన్ వ్యాఖ్యలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Show comments