iDreamPost
చరిత్ర ఒక మాస్టర్ స్టోరీటెల్లర్ చేతిలో పడితో ఎలాగ ఉంటుంది? అదే పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు. సినిమా మొత్తం విక్రమ్ చుట్టూనే తిరుగుతున్నట్లు టీజర్ లో కనిపిస్తోంది. కోట గోడలను పగలగొట్టిన సీన్, సముద్ర యుద్ధం అంతా... టీజర్ కే హైలెట్ గా కనిపిస్తోంది.
చరిత్ర ఒక మాస్టర్ స్టోరీటెల్లర్ చేతిలో పడితో ఎలాగ ఉంటుంది? అదే పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు. సినిమా మొత్తం విక్రమ్ చుట్టూనే తిరుగుతున్నట్లు టీజర్ లో కనిపిస్తోంది. కోట గోడలను పగలగొట్టిన సీన్, సముద్ర యుద్ధం అంతా... టీజర్ కే హైలెట్ గా కనిపిస్తోంది.
iDreamPost
ఈ కల్లు, పాట, రక్తం, పోరాటాలు అంతా దాన్ని మర్చిపోవడానికే, ఆమెను మర్చిపోవడానికే. నన్ను నేను మర్చిపోవడానికే. పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ అయ్యింది. చరిత్ర, ఒక పోరాటం, ఒక అందం కలగలసిన కథను మణిరత్నం తెరకెక్కించారు.
చరిత్ర ఒక మాస్టర్ స్టోరీటెల్లర్ చేతిలో పడితో ఎలాగ ఉంటుంది? అదే పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు. సినిమా మొత్తం విక్రమ్ చుట్టూనే తిరుగుతున్నట్లు టీజర్ లో కనిపిస్తోంది. కోట గోడలను పగలగొట్టిన సీన్, సముద్ర యుద్ధం అంతా… టీజర్ కే హైలెట్ గా కనిపిస్తోంది.
మరి ఐశ్వర్య రాయ్ పాత్ర అంతఃపురంలో కుందవాయి పాత్రను పోషిస్తున్న త్రిషకు ఎదురుపడిన సీన్ తో ఈ ఇద్దరి మధ్య పోటీయే కథకు మూలం కానుంది.
తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
ఇంతకి విక్రమ్ చెప్పి ఆమె ఎవరు?
ఒక్కొక్కిటిగా రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ పోస్టర్లు ఇండియా మొత్తం బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియా ఎదురుచూస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ . మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ మాత్రమేకాదు, సినిమా ఇండస్ట్రీకూడా ఆసక్తిగా చూస్తోంది. సౌత్ కల్చర్ ను ప్రతిబించేలా చారిత్రాత్మక చిత్రంగా పొన్నియన్ సెల్వన్ కు క్రేజ్ వస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నవాళ్లందరూ దిగ్గజాలే. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
త్రిష పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. కుందవాయి పాత్రలో త్రిష ఒంటినిండా నగలతో, రవివర్మ గీసిన పేయింటింగ్‌లా మెరిసిపోతుంది. ఇంతకుముందు వచ్చిన ఐశ్వర్యరాయ్, కార్తి, విక్రమ్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు మంచి క్రేజ్ వచ్చింది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
అంతకుముందు పొన్నియన్ సెల్వన్ స్టార్, చియాన్ విక్రమ్, టీజర్ లాంచ్‌కు ముందు , తీవ్ర జ్వరం కారణంతో హాస్పటల్ చేరాడు. ఆసుపత్రిలో చేరారు, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు
విక్రమ్ కి తీవ్ర జ్వరం రావడంతో చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, కొన్ని నివేదికలు అతనికి గుండెపోటు వచ్చినట్లు సూచించాయి. అదేం నిజం కాదని చియాన్ విక్రమ్ సన్నిహితులంటున్నారు.