తెలుగులోను డబ్బింగ్ మూవీ డామినేషన్.. లియోకి అన్ని థియేటర్లా..

  • Author ajaykrishna Updated - 04:41 PM, Tue - 17 October 23
  • Author ajaykrishna Updated - 04:41 PM, Tue - 17 October 23
తెలుగులోను డబ్బింగ్ మూవీ డామినేషన్.. లియోకి అన్ని థియేటర్లా..

ఈ ఏడాది దసరాకు బాక్సాఫీస్ వద్ద బిగ్ వార్ జరగబోతున్న సంగతి తెలిసిందే. పండుగ వేళలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో ముందుగా లియో.. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ ఇది. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు పోటీగా తెలుగు నుండి రెండు బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవే బాలయ్య నటించిన భగవంత్ కేసరి.. మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు. ఇందులో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రిలీజ్ అవుతుండగా.. భగవంత్ కేసరి తెలుగు వరకే రిలీజ్ అవుతోంది.

జనరల్ గా ఏ సినిమా విడుదలైనా.. పోటీగా పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఎవరి సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో చూసి లెక్కలు వేస్తుంటారు. ఈ క్రమంలో లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో బిగ్ వార్ జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం.. స్ట్రెయిట్ పాన్ ఇండియా సినిమాకంటే.. డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల ప్రకారం.. లియో మూవీకి తెలుగు స్టేట్స్ లో మొత్తం 880 థియేటర్లు, టైగర్ నాగేశ్వరరావుకు 480 థియేటర్లు.. భగవంత్ కేసరికి 1100 థియేటర్స్ గా లెక్కలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ లెక్కలైతే ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. కాగా.. తెలుగు హీరో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు కంటే తమిళ డబ్బింగ్ సినిమాగా వస్తున్న లియో మూవీకి ఎక్కువ థియేటర్స్ కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. భగవంత్ కేసరి కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతోంది. సరే.. ఆ సినిమాకు ఎక్కువే ఉన్నాయి. కానీ.. టైగర్ నాగేశ్వరరావు కూడా స్ట్రెయిట్ తెలుగు మూవీనే కదా! ఎందుకని డబ్బింగ్ మూవీ లియో కంటే తక్కువ థియేటర్స్ ఇచ్చారని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ లెక్కన తెలుగులో కూడా దసరాకు లియో డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments