Idream media
Idream media
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇప్పటికీ 12 సీజన్‌లు పూర్తి చేసుకుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ ఎన్నో రికార్డులకు వేదికగా నిలుస్తుంది.ఐపీఎల్ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరుతో సాధించిన కొన్ని రికార్డులు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతున్నాయి.ఈ కోవలో భారత సారథి,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయినా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్-2016 సీజన్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్‌లో మరపురాని జ్ఞాపకంగా నిలిచింది.ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో 973 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు సెంచరీలు సాధించడం విశేషం.ఐసీసీ గుర్తింపు పొందిన ఒక టీ-20 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.ఆ తరువాత మూడు ఐపీఎల్ సీజన్‌లు జరిగినప్పటికీ ఏ ఆటగాడు ఆ రికార్డు దరిదాపుల్లోకి రాలేదు.ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒక టీ-20 టోర్నీలో కనీసం 800 పరుగుల మార్కును అందుకోలేదు.
అప్పటిదాకా టీ-20 మ్యాచ్‌లలో కనీసం ఒక సెంచరీ సాధించని విరాట్ కోహ్లీ ఐపీఎల్-2016 సీజన్‌లో నాలుగు సెంచరీలతో అదరకొట్టాడు.అంతేకాక మరో 7 అర్ధసెంచరీలను చెయ్యడంతో ఐపీఎల్-2016లో మొత్తం 11 సార్లు 50 పరుగులు పైగా సాధించాడు.వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మాత్రమే 2011లో నాలుగు సెంచరీలను సాధించాడు.ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లీదే. 2019లో 18 సార్లు 50 పరుగులకు పైగా చేసి అత్యధిక అర్థ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా మరో ప్రపంచ రికార్డును తన పేరుమీద లిఖించాడు.