iDreamPost
iDreamPost
ఇటీవలే కన్నుమూసిన పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకాల నుంచి అందరూ మెల్లగా బయటికి వస్తున్నారు. లక్షలాది అభిమానుల నుంచి గొప్ప వీడ్కోలు అందుకున్న ఈ కన్నడ పవర్ స్టార్ తాను చనిపోయాక కూడా నలుగురికి చూపు రావడంలో సహాయం చేసి ఈ రూపంలోనూ మానవత్వం చాటుకున్నాడు. ఇక ఇప్పుడు మూవీ లవర్స్ చూపు తన చివరి సినిమా మీద ఉంది. అదే జేమ్స్. ఇది చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. లాక్ డౌన్ రెండుసార్లు రాకపోయి ఉంటే యువరత్న తర్వాత తక్కువ గ్యాప్ లో వచ్చేది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు తీరా ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో హీరోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.
జేమ్స్ కి దర్శకుడు చేతన్ కుమార్. ఆయన వెర్షన్ ప్రకారం ఇందులో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ఆ అవకాశం లేదు. ఒక ఫైట్ పెండింగ్ ఉంది. అదీ ఏదోలా సర్దుబాటు చేసి స్క్రిప్ట్ కి అనుగుణంగా మేనేజ్ చేయొచ్చు.కానీ పునీత్ స్వంత గొంతు వినే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే జేమ్స్ డబ్బింగ్ ఇంకా జరగలేదు. గుమ్మడి కాయ కొట్టాక చేద్దామని దర్శకుడు హీరో అనుకున్నారట. ఈలోగా విధి వెక్కిరించింది. అందుకే తన బదులు అన్నయ్య శివ రాజ్ కుమార్ తో డబ్బింగ్ చెప్పించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. ఈ విషయం ఆయన్నే అడిగితే అంతకంటే గర్వం జ్ఞాపకం మరొకటి ఉండదని చెప్పడం విశేషం.
జేమ్స్ లో పలు విశేషాలు ఉన్నాయి. ఇందులో శ్రీకాంత్ విలన్ గా నటించారు. గతంలో సుదీప్ శివ రాజ్ కుమార్ కాంబోలో వచ్చిన మల్టీ స్టారర్ విలన్ లో ఆల్రెడీ ప్రతినాయక పాత్ర పోషించారు. తన పోర్షన్ ఎప్పుడో తీసేశారు. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించిన జేమ్స్ కు చరణ్ రాజ్ సంగీతం అందించారు. తెలుగు సంతతికి చెందిన కిషోర్ పత్తికొండ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారాలన్నీ పూర్తి చేసి 2022 మార్చ్ 17న పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. జేమ్స్ ని అన్ని భాషల్లో తీసుకొస్తారు
Also Read : Pushpa : పాన్ ఇండియా సినిమాకు డబ్బింగ్ చిక్కు