iDreamPost
iDreamPost
మరో శుక్రవారం వచ్చేస్తోంది. థియేటర్లు తెరిచాక ఎక్కడా లేని స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపంతో మొదలుపెట్టి లవ్ స్టోరీ దాకా వాటి బడ్జెట్ లను మించి భారీ లాభాలు దక్కించుకున్నాయి. బ్లాక్ బస్టర్ల నెంబర్ తక్కువే అయినా మిగిలిన నిర్మాతలకు ప్రోత్సాహం దక్కేలా ఇవి విజయం సాధించడం విశేషం. ఇక విషయానికి వస్తే రేపు మూడు సినిమాలు రాబోతున్నాయి. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం కావడంతో ‘కొండపొలం’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ కి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

నవీన్ చంద్ర నటించిన ‘నేను లేని నా ప్రేమకథ’ కూడా రేపే రిలీజ్ కాబోతోంది. ఇదీ టాక్ మీద ఆధాపడిందే. ఎల్లుండి 9న శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ తమిళనాడులో భారీ బజ్ తో రిలీజవుతోంది కానీ ఇక్కడ రెస్పాన్స్ స్లోగా ఉండొచ్చు. ట్రైలర్ కట్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. నాని గ్యాంగ్ లీడర్ షేడ్స్ కనిపిస్తున్నప్పటికీ టీమ్ మాత్రం గట్టి నమ్మకంతో హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పోటీ కీలకంగా ఈ నాలుగు సినిమాల మధ్యే ఉండబోతోంది. ఏ క్వైట్ ప్లేస్ 2 లాంటి హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి కానీ వాటి నుంచి పెద్దగా ఆశించడానికి ఏమి లేదు. చూడాలి మరి ఈ వీక్ విన్నర్ ఎవరు కాబోతున్నారో
Also Read : ప్రకాష్‌రాజ్ పరాయివాడా?