Swetha
ఇప్పుడు ఓటీటీ లకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీ లో ఎక్కువ వ్యూస్ అందుకున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది.
ఇప్పుడు ఓటీటీ లకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీ లో ఎక్కువ వ్యూస్ అందుకున్న సినిమాలు, సిరీస్ ల గురించి ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది.
Swetha
ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ఇప్పటివరకు ఎంతో మంచి కంటెంట్ తో.. ప్రేక్షకులకుఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా, ఇతర భాషల సినిమాలు, సిరీస్ లను కూడా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయడంతో.. రోజు రోజుకి ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కు సబ్ స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఏడాది వ్యవధిలోనే నెట్ ఫ్లిక్స్ బిలియన్ మార్క్ ను అందుకోవడం విశేషం. ఈ క్రమంలో ఏ ఏ సినిమాలకు , సిరీస్ లకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది నెట్ ఫ్లిక్స్ ఓ నివేదికలో వెల్లడించింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
‘వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్టు’ పేరుతో నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ఎక్కువ వ్యూస్ ను సాధించిన సినిమాలు, సిరీస్ ల జాబితాను వెల్లడించింది. గత ఏడాది 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు వరల్డ్ వైడ్ గా 9 వేల గంటల వ్యూస్ ను అందుకున్నట్లు ప్రకటించింది. మరి ఈ వ్యవధిలో ఏ ఏ సినిమాలు ఎన్ని వ్యూస్ సంపాదించుకున్నాయి చూసేద్దాం.
ఇక ఈ సినిమాలతో పాటు.. ఓఎంజీ 2, లస్ట్ స్టోరీస్ 2, డ్రీమ్ గర్ల్ 2, కర్రీ అండ్ సయనైడ్, కోహ్రీ, గన్స్ అండ్ గులాబ్స్, కాలా పానీ లాంటి సినిమాలు కూడా మంచి వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొరియన్, స్పానిష్, జపనీస్ సినిమాలు, వెబ్ సీరిస్‌లు కూడా మంచి వ్యూస్ సంపాదించుకునున్నాయి. భారత్‌కు చెందిన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు, సిరీస్ లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లకు మంచి ఆదరణ లభిస్తుంది కాబట్టి.. రానున్న రోజుల్లో రికార్డు బ్రేక్ వ్యూస్ సంపాదించుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు, మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.