హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టైమింగ్స్‌ మార్పు..

Metro Train Timings: నగర వాసులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ప్రకటన చేసింది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

Metro Train Timings: నగర వాసులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ ప్రకటన చేసింది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాక.. ప్రయాణం చాలా సజవుగా.. సుఖంగా మారింది. గంటలు గంటలు ట్రాఫిక్‌లో పడిగాపులు కాయాల్సిన పని లేదు. ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా నిమిషాల వ్యవధిలో గమ్యస్థలం చేరవచ్చు. ఇక వేసవిలో అయితే మెట్రో ప్రయాణం ఎంతో సుఖవంతం అని చెప్పవచ్చు. ఇక వర్షాకాలంలో కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా క్షేమంగా ఇంటికి చేరాలంటే.. మెట్రోనే బెస్ట్‌ ఆప్షన్‌ అంటారు. ఎలాంటి టెన్షన్‌ లేకుండా.. హాయిగా ప్రయాణం సాగించవచ్చు.. క్షేమంగా ఇంటికి చేరవచ్చు. దాంతో చాలా మంది మెట్రో జర్నీకే మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో నగరవాసులకు మెట్రో శుభవార్త చెప్పింది. టైమింగ్స్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో.. నగర వాసులు అర్థరాత్రి వరకు ఎంచక్కా మెట్రోలో ప్రయాణాలు చేయవచ్చు. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మెట్రో ప్రారంభమయ్యే టెర్మినల్స్‌లో చివరి రైలు రాత్రి 11 గంటలకు బయల్దేరనుండగా.. తాజాగా ఆ సమయాన్ని మరి కాస్త పెంచారు. ఇక నుంచి ప్రతి టెర్మినల్‌లో రాత్రి 11.45 గంటలకు చివరి ట్రైన్ బయల్దేరనుంది.

పెంచిన సమయం వల్ల మెట్రో చివరి స్టేషన్‌కు అర్థరాత్రి దాటక అనగా 12.45 గంటలకు చేరనుంది. ఉదాహరణకు మియాపూర్‌లో రాత్రి 11.45 గంటలకు చివరి ట్రైన్ బయల్దేరి ఎల్బీ నగర్ స్టేషన్‌కు 12.45 గంటలకు చేరుకోనుంది. గతంలో ఈ ట్రైన్ 11 గంటలకి బయల్దేరి 12 గంటలకు ఎల్పీనగర్ చేరుకునేది. అయితే మెట్రో అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల.. ఇప్పడు అదనంగా గంట 15 నిమిషాలు ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

అదే విధంగా ప్రస్తుతం మెట్రో ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుండగా.. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు సమాచారం.

మెట్రో ట్రైన్ సమయం పొడిగించటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు మధ్యాహ్నం షిప్టుల్లో వెళుతుంటారు. దాంతో చాలా మందికి అర్థరాత్రి 11- 12 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు మెట్రో సమయం పెరగటంతో వారికి ఊరట లభిచింది.

Show comments