Swetha
తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతరత్నకు అర్హులను అసలు ఎలా ఎంపిక చేస్తారు? విజేతలకు అందే సదుపాయాలు, ప్రయోజనాలు ఏంటి? అన్నది తెలుసుకుందాం.
తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతరత్నకు అర్హులను అసలు ఎలా ఎంపిక చేస్తారు? విజేతలకు అందే సదుపాయాలు, ప్రయోజనాలు ఏంటి? అన్నది తెలుసుకుందాం.
Swetha
దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో భారత రత్న ఒకటి. ఇప్పటికే ఎంతో మంది మహనీయులు ఈ ప్రత్యేకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన బిరుదులు, పురస్కారాలు అందరికి ఇవ్వరు. వీటిని సంపాదించాలి అంటే వారికంటూ .. ఆయా రంగాలలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అడ్వాణీకి .. కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. అయితే, అసలు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి వ్యక్తులను ఎలా ఎంపిక చేసుకుంటారు! ఈ పురస్కారం అందుకున్న తర్వాత వారు పొందే సదుపాయాలు ఎలా ఉంటాయి! వాటి వలన ప్రయోజనాలు ఏంటి ! అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే, ఏదైనా రంగంలో విశేష కృషి చేస్తున్న వారికీ భారరదేశంలో ఇచ్చే.. ఉన్నత పురస్కారం “భారత రత్న”. 1954 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు. తొలి పురస్కారాన్ని..భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజా గోపాల చారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ చంద్ర శేఖర వెంకట్రామన్ లకు ఈ పురస్కారాలు అందించారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో ప్రత్యేకమైన సేవలు అందించిన చాలా మందికి భారత రత్న అందించారు. అయితే, భారత రత్న పురస్కారాలకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ.. పద్మ అవార్డుల కంటే బిన్నంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రధాన మంత్రి నుంచి మొదలవుతోంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. దీనికి కుల, మత, వర్గ ,లింగ బేధాలు ఉండవు. అలాగే ఒకే ఏడాదిలో ముగ్గురికి ఈ భారత రత్నను అందిస్తారు. భారత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ప్రతియేటా ఒకరికి మాత్రమే ఈ అవార్డు ఇవ్వాలనే నియమం ఏమి లేదు. 2019లో సామజిక సేవకులు నానాజీ దేశ్ ముఖ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , కళాకారుడు డాక్టర్ హజారీక లకు భారత రత్న ప్రకటించారు.
కాగా భారత రత్న గ్రహీతలకు ఒక సర్టిఫికేట్, ఒక మెడల్ ను ఇస్తుంది. వీటితో పాటు కొన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రైల్వేలో ఉచిత ప్రయాణాలు లాంటివి ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఈ అవార్డు గ్రహీతలు కొన్ని నియమాలను కూడా.. పాటించవలసి ఉంటుంది. వారు ఈ అవార్డును పొందిన తర్వాత వారి పేరుకు ముందు.. ఈ పేరును పెట్టుకోకూడదు. లెటర్ హెడ్ , రెజ్యూమె, విసిటింగ్ కార్డులో మాత్రం ఈ అవార్డును అందుకున్నట్టు రాసుకోవచ్చు. ఇక ఈ భారత రత్న రూపు రావి చెట్టు ఆకు రూపంలో ఈ పథకం కనిపిస్తోంది. మరోవైపు అశోక స్తంభం ముద్ర కనిపిస్తోంది. ఇకపోతే ఈ అత్యున్నత పురస్కారాన్ని జీవించిఉన్నపుడు, మరణానంతరం కూడా ఇస్తూ ఉంటారు. ఇలా భారత రత్న పురస్కారానికి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.