వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నా.. ఆ మ్యాచ్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఇండియా-పాక్ మ్యాచ్ గురించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను పాండ్యా అవుట్ చేసిన తీరు మనందరికి తెలిసిందే. అయితే ఆ బాల్ వేసే ముందు పాండ్యా ఏదో మంత్రం చదివాడని అందుకే ఇమాన్ అవుట్ అయ్యాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఇమామ్ ఔట్ వెనకున్న సీక్రెట్ ను రివీల్ చేశాడు పాండ్యా. మరి ఇంతకీ పాండ్యా ఆ రోజు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ను హార్దిక్ పాండ్యా 13వ ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. అయితే సరిగ్గా ఇమామ్ ఔట్ అయిన బంతి వేసే ముందు పాండ్యా.. బంతిని చేతిలో ఉంచుకుని నోటి దగ్గరగా పెట్టుకుని ఏదో గట్టిగా చదివాడు. అనంతరం వేసిన బాల్ కు ఇమామ్ అవుట్ అయ్యాడు. దీంతో పాండ్యా బాల్ కు ఏదో మంత్రం వేశాడని సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఔట్ వెనకున్న సీక్రెట్ ను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు పాండ్యా.
పాండ్యా మాట్లాడుతూ..”అప్పటి వరకు నేను ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో నాపై నాకే కోపం వచ్చింది. అందుకే నన్ను నేను తిట్టుకున్నా. బంతిని లైన్ అండ్ లెంగ్త్ లో వేయాలని నాకు నేనే చెప్పుకున్నా. అంతేగాని బంతికి నేను ఎలాంటి మంత్రం వేయలేదు. నాకు మంత్రాలు రావు” అని దీని వెనక ఉన్న మిస్టరీని రివీల్ చేశాడు పాండ్యా. ఇక ఈ మ్యాచ్ లో పాండ్యా 6 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరి పాండ్యా ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.