M. S. Swaminathan Passed Away: హరిత విప్లవ పితామహుడు MS. స్వామినాథన్ మృతి

హరిత విప్లవ పితామహుడు MS. స్వామినాథన్ మృతి

భారత వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన హరిత విప్లవ పితామహుడు MS.స్వామినాథన్ (98) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణంతో అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. MS.స్వామినాథన్ మృతి చెందాడని తెలియడంతో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు.

ఇకపోతే, వ్యవసాయం రంగంలో ఎనలేని కృషి చేసిన MS.స్వామినాథన్.. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే మన దేశంలో ఆహార కొరతను ఎదుర్కొవడానికి మేలైన వరి వంగడాలను సృష్టించారు. ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ఆయన సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు. మొదటగా హరిత విప్లవాన్ని నార్మన్ బోర్లాగ్ వెలుగులోకి తీసుకురాగా.. మన దేశంలో మాత్రం MS.స్వామినాథన్ ఎంతగానో కృషి చేశారు. అప్పటి నుంచి ఆహార కొరతను ఎదుర్కొవడానికి సులువైన మర్గం ఏర్పడింది.

  • ఇది కూడా చదవండి: HYD మెట్రోకు రూ.10 వేల జరిమానా! 4 ఏళ్లు పోరాడిన సామాన్యుడు!
Show comments