Idream media
Idream media
నేను చాలా ఏళ్లు ESI పరిధిలో ఉన్నాను. తిరుపతి ఆస్పత్రికి ఒకసారి వెళ్లాను. గవర్నమెంట్ ఆస్పత్రికి , దానికీ పెద్ద తేడా ఏమీ లేదు. రోగుల పట్ల ప్రేమ ఉండదు. మంచి మందులు ఎలాగూ ఉండవు. ఆలాంటి ఆస్పత్రిల్లో రోగులకు హెయిర్ ఆయిల్ క్రీములు కూడా ఇచ్చారంటే అది చంద్రబాబు ప్రభుత్వ గొప్పతనమే. నెత్తికి చమురు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.
తల నూనెను రాయలసీమలో చమురు అని కూడా అంటారు. పిల్లలకు ఆముదం, పెద్దవాళ్లకి కొబ్బరి నూనె. కంపెనీ నూనెలు రాక ముందు గానుగలో కొబ్బరి నూనె ఆడించేవాళ్లు. మోసం చేయడాన్ని నెత్తికి చమురు రాయడం అని కూడా అంటారు. చాలా తెలివిగా లౌక్యంగా ప్రవర్తించే వాళ్లని “వాడు ఒంటికి చమురు పూసుకుని తిరుగుతాడు, అంత సులభంగా దొరకడు” అంటారు. బాబు కూడా ఆ టైపే. మామూలుగా పూర్వకాలం దొంగలు వళ్లంతా చమురు పూసుకుని వచ్చేవాళ్లు. ఒకవేళ దొరికినా జారిపోతారు.
తాను ఎవరికీ దొరకనని బాబు నమ్మకం. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు కూడా ఒక గాలి వానకి గోవిందా. సిట్ అనే గాలివాన బాబుని చుట్టుకునేలా ఉంది. మన దేశం గొప్పతనం ఏమంటే చాలా విషయాల్లో ఏకసూత్రత ఉంటుంది. రైల్వే స్టేషన్లనీ ఒక్కలాగే ఉంటాయి. అనకాపల్లిలో టీ తాగినా , అస్సాంలో తాగినా ఒకటే రుచి.
ఈ జబ్బు ఈ మధ్య ఎయిర్‌పోర్ట్‌లకి కూడా సోకింది. గోవాలో ఇడ్లీ డాట్‌కమ్ అని ఒక హోటల్ ఉంది. రెండు ఇడ్లీ , ఒక వడ, అప్పడంలాంటి దోశ కలిపి రూ.360. ఇడ్లీ పేరు పెట్టుకున్నాడు కదా, కనీసం ఇడ్లీ అయినా బాగుంటుందనుకుంటే , అవి ఎంత గట్టిగా ఉన్నాయంటే వాటి సాయంతో ఫ్లైట్‌ని హైజాక్ కూడా చేయవచ్చు.
ESI ఆస్పత్రులు కూడా దేశమంతటా ఒక్కలాగే రోగులకి నాన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాంటి చోట గత తెలుగుదేశం వాళ్లు కార్మికులకి హెయిర్ ఆయిల్ సప్లయి చేసి కోట్లు ఖర్చు పెట్టేశారు. డబ్బు తినేశారు. అనకూడదు ఇక్కడ, డబ్బుని జుత్తుకి పూ
సుకున్నారు అనాలి.
అందమే ఆనందం అని వెనుకటికి ఒక కవి అన్నాడు. అందంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఆనందమంటే ఆరోగ్యం. కాబట్టి కార్మికులు అందం కోసం డబ్బు ఖర్చు పెట్టారు. What a Logic Sirji?
రెండెకరాలతో మొదలు పెట్టి, వేల కోట్లకి ఎదిగిన చంద్రబాబు కూడా నీతినిజాయితీల గురించి స్పీచ్‌లు ఇచ్చేస్తాడు.
అచ్చేదిన్ మోడీ తెస్తాడో లేదో కానీ, అచ్చెంనాయుడికి మాత్రం ముందు ముందు అచ్చేదిన్ లేవు. డబ్బుని తైలం అని కూడా అంటారు. తైలంలోంచి తైలం తీశారు మనవాళ్లు!