Swetha
OTT Movie Suggestion- Best Thriller Movie In OTT: ఇప్పటివరకు ఎన్నో సైకో థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ .. ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఈ సినిమా చూసాక అనిపించడం ఖాయం.
OTT Movie Suggestion- Best Thriller Movie In OTT: ఇప్పటివరకు ఎన్నో సైకో థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ .. ఇలాంటి ఓ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఈ సినిమా చూసాక అనిపించడం ఖాయం.
Swetha
ఇప్పుడు అందరు క్రైమ్, సస్పెన్స్, హర్రర్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ జోనర్ సినిమాలు ఆ రేంజ్ లో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి మరి. ఇప్పడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ ఆ లేక లవ్ స్టోరీ నా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అమ్మాయి.. అబ్బాయి మధ్య ఉండే ప్రేమ గురించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి సినిమా మాత్రం నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఈ సినిమా ఏంటి.. ఏముంది వేరే ఏ సినిమాలలో లేనిది ఈ సినిమాలో ఏముంది. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
ప్రేమ గురించి చాలా మంది కవులు, రచయితలు ఎంతో గొప్పగా వర్ణిస్తారు. మరి వారంతా ఈ సినిమా చూసిన తర్వాత ఎలాంటి భావాలూ వ్యక్తం చేస్తారో ఏమో.. సుమన్ అనే కుర్రోడు ఓ PHD స్టూడెంట్. తన ఫ్రెండ్స్ తో కలిసి అడవులకు వెళ్లడం.. అక్కడ దొరికిన జంతువుల మాంసాన్ని అక్కడే వండుకుని తినడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అలా మాంసం తినడం వలన తన ఫ్రెండ్ హెల్త్ పాడవుతుంది. అతని ఫ్రెండ్ కు చికిత్స చేసే సమయంలో.. నిర్మలి అనే ఓ డాక్టర్ తో తనకు పరిచయం ఏర్పడుతుంది. ఆమె తనకు కూడా మాంసం అంటే ఇష్టమని చెప్పడంతో ఆ నెక్ట్ డే తనకు కుందేలు మాంసాన్ని వండి మరి తీసుకుని వస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిర్మలికి అప్పటికే పెళ్ళైపోతుంది ఓ బాబు కూడా ఉంటాడు. తన భర్త కూడా ఓ డాక్టర్.. ఆయన ఎక్కువగా క్యాంపులకు వెళ్తుండడంతో వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
దీనితో నిర్మలికి దూరంగా ఉండాలని.. సుమన్ ఫ్రెండ్స్ తనను హెచ్చరిస్తూ ఉంటారు. కానీ వాళ్లిద్దరూ మాత్రం ఒకరితో ఒకరు బాగా పరిచయం పెంచుకుంటారు. రకరకాల ప్రదేశాలకు వెళ్లి వేర్వేరు జంతువుల మాంసాలను ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిర్మలి మీద మరింత ఇష్టం పెంచుకుంటాడు సుమన్. ఈ క్రమంలో ఆమెపై ప్రేమ ఎక్కువయ్యి పోయి.. తన శరీరంలోని ఓ భాగాన్ని కట్ చేసి దానిని వండి నిర్మలికి తినిపిస్తాడు. అది ఆమెకు విపరీతంగా నచ్చుతుంది, ఆమె మెల్లగా మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. అలా అలవాటు పడిన నిర్మలి తర్వాత ఏం చేసింది ? ఆమె కోసం సుమన్ ఏం చేసాడు ? మనిషి మాంసాన్ని తినే మనుషులు కూడా ఉంటారా ? ఇవన్నీ తెలియాలంటే “ఆమీస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ఇండియన్ సినిమాల్లోనే మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ కేటగిరీల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.