Dobaaraa తాప్సీ సినిమాకు ఇంత అవమానమా?

ఇటీవలే వచ్చిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లకు జరిగిన పరాభవం కలెక్షన్ల సాక్షిగా కనిపిస్తోంది.

ఇటీవలే వచ్చిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లకు జరిగిన పరాభవం కలెక్షన్ల సాక్షిగా కనిపిస్తోంది.

బాలీవుడ్ దీన స్థితిని చూసి ఎవరైనా అయ్యో పాపం అనాల్సిందే. వరసబెట్టి సినిమాలు డిజాస్టర్ కు తక్కువ స్థాయిలో ఆడకపోవడంతో ఎలాంటివి తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అర్థం కాక అక్కడి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవలే వచ్చిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లకు జరిగిన పరాభవం కలెక్షన్ల సాక్షిగా కనిపిస్తోంది. హిందీ వెర్షన్ కార్తికేయ 2 మొదటి రోజు అరవై స్క్రీన్లతో మొదలుపెడితే ఇప్పుడా కౌంట్ ఏకంగా ఏడు వేలు దాటేయడం కనివిని ఎరుగని రికార్డు. నిన్న అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ ల కన్నా నిఖిల్ మూవీకే ఎక్కువ వసూళ్లు వచ్చిన మాట వాస్తవం. ఇది చాలక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మరో బాంబు వచ్చి పడింది.

 

నిన్న విడుదలైన తాప్సీ దొబారాకు దారుణమైన ఓపెనింగ్స్ దక్కాయి. చాలా చోట్ల 3 శాతం కంటే ఆక్యుపెన్సీ రావడంతో సుమారు రెండు వందల షోలను క్యాన్సిల్ చేసినట్టుగా ముంబై టాక్. అసలు సినిమా ఎలా ఉందో టాక్ బయటికి రాకుండానే జనం దీన్ని తిరస్కరించడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లమవుతోంది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ కున్న బ్రాండ్ వేల్యూ కొంచెం కూడా పని చేయలేదు. పైగా దీని ప్రమోషన్లలో నెటిజెన్లను రెచ్చగొట్టేలా బాయ్ కాట్ ట్రెండ్ గురించి ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ చులకన చేయడం పట్ల సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పుడా ఓవర్ కాన్ఫిడెన్స్ కు తగ్గ ఫలితాన్నే అందుకున్నారని కౌంటర్లు వేస్తున్నారు.


ఈ దొబారా కొత్త కథేమీ కాదు. 2018 స్పానిష్ మూవీ మిరేజ్ కు రీమేక్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన మర్డర్ మిస్టరీ ఇది. ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో అవసరానికి మించి కన్ఫ్యుజింగ్ స్క్రీన్ ప్లే నడిపించడంతో ఆడియన్స్ సహనానికి అనురాగ్ పెద్ద పరీక్ష పెట్టారు. సాంకేతిక విభాగాల కృషి బాగానే ఉన్నప్పటికీ అసలైన కంటెంట్ తడబాటుకు గురవ్వడంతో దొబారాను రిజెక్ట్ చేసేసారు. ఈ రోజు రేపు వీకెండ్ ని వాడుకుని ఏదైనా రాబట్టుకుంటే నయం. కంగనా రౌనత్ దాకడ్ తీసికట్టు కలెక్షన్లను తాప్సీ బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకుల అంచనా. శభాష్ మితు తర్వాత తక్కువ గ్యాప్ లో తాప్సీకి దక్కిన రెండో సూపర్ ఫ్లాప్ ఇది

Show comments