అది జగన్ భ్రమే : చంద్రబాబు

అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగదని, అది జగన్ భ్రమేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంత పర్యటనలో ఉన్న చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరో చోట పెడితే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని భావించడం బ్రమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు పక్కా ప్రణాళికతో వెళ్ళాలని పేర్కొన్నారు. గతంలో ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయం ఒక్కొక్క చోట ఉండడం వల్ల ప్రజలు తిరిగేందుకు ఇబ్బందులు పడేవారన్నారు. ఉదయం ఇంటి నుంచి వచ్చిన వారు సాయంత్రానికి పనులు చక్కదిద్దుకొని ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు ఆ నాడు మండల వ్యవస్థ పెట్టారని పేర్కొన్నారు.

తండ్రి వైఎస్సార్ లో ఉన్న మంచితనం జగన్ లో 10 శాతం కూడా లేదని చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ కు అయన తాత రాజా రెడ్డి బుద్దులు వచ్చాయన్నారు. ఎన్నికల వేల మాయమాటలు చెప్పి ఓట్లు వేపించుకుని, గద్దెనెక్కారని విమర్శించారు. ఇప్పుడు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు అలానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శాసన సభలో వారు ఎలా ప్రవర్తించింది ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

మొత్తం మీద రాజధాని అంశం పై చంద్రబాబు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజధాని చుట్టూ వేల ఎకరాలు భూములు కొనుగోలు చేయించారన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ తాజా ఆలోచనలు చంద్రబాబు అండ్ కో కు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అందుకే సీఎం జగన్ పై ఉన్మాది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భవిస్తున్నారు. ఎన్నికల వేల మాయమాటలు చెప్పారంటున్న చంద్రబాబు.. ఆ మాటలు ఏవో మాత్రం చెప్పడం లేదు. ఎన్నికల మేనిఫెస్టో తమకు భగవద్గిత, బైబిల్, ఖురాన్ తో సమానమని, అందులో చెప్పిన ప్రతి అంశం నెరవేరుస్తామని సీఎం జగన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మేరకు ఇప్పటికే పలు హామీలు అమలు చేశారు. మరికొన్నింటికి రూపు ఇస్తుండగా చంద్రబాబు విమర్శలు అర్థరహితమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments