Jr NTR ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. వాయిదాపడనున్న దేవర?

దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ 5వ తేదీన మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మూవీ పోస్టుపోన్‌ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ 5వ తేదీన మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, మూవీ పోస్టుపోన్‌ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌- విలన్‌ సైఫ్‌ అలీఖాన్‌ల మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌లను తెరకెక్కించినట్లు సమాచారం. అయితే, ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ న్యూస్‌ తెగ వైరల్‌గా మారింది.

దేవర మూవీ విడుదల వాయిదా పడనుందట. ఏప్రిల్‌ 5న కాకుండా.. రెండు నెలలు ముందుకు వెళ్లనుందట. ఇందుకు ప్రధాన కారణంగా వీఎఫ్‌ఎక్స్‌గా తెలుస్తోంది. దేవరలో ఎక్కువ భాగం వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయి. అవుట్‌ పుట్‌ బాగా రావాలనే కారణంతో ఎక్కువ టైంలో వీఎఫ్‌ఎక్స్‌ కోసం కేటాయించనున్నారట. అంతేకాదు! చిత్ర షూటింగ్‌కు సంబంధించి ఇంకా 45 రోజుల షూటింగ్‌ బాకీ ఉందంట. షూటింగ్‌ బాకీ, వీఎఫ్‌ఎక్స్‌ ప్రధాన కారణాలు అయితే.. ఏపీలో ఎలక్షన్‌లు కూడా మరో కారణంగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఎన్నికలు మార్చి చివరల్లో జరిగితే.. ఏప్రిల్‌లో కౌంటింగ్‌.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మూవీ విడుదల చేయటం మంచిది కాదని చిత్ర  బృందం భావించినట్లు తెలుస్తోంది. అందుకే జూన్‌ నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. చిత్ర యూనిట్‌ను ఓ అధికారిక ప్రకటన వస్తే గానీ, దీనిపై క్లారిటీ రాదు. కాగా, దేవర సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. తంగం అనే ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. జాన్వీకి ఇది సౌత్‌లో తొలి సినిమా. తెలుగులో మూవీ చేయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఇక, దేవర మూవీకి అనురుద్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతోంది. కోసరాజు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొన్న విడుదల అయిన ‘ దేవర’ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. హాలీవుడ్‌లో లెవెల్‌లో గ్లింప్స్‌ ఉందంటూ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా అందులోని గ్రాఫిక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, దేవర మూవీ పోస్టు పోన్‌ అవ్వబోతోందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments