Idream media
Idream media
నేను సినిమాలు చూడను, నాకు సినిమా గురించి అసలు తెలీదు.. ఎప్పుడో టీవీ లో చూడటమే గాని థియేటర్ కి మొదటి రోజు వెళ్లి సినిమా చూడటం అనేది నాకు తెలియదు.. కాని వాళ్ళు పడే కష్టం, వాళ్ళు పడే తపన, వాళ్ళు పడే రోదన, ఆ కుటుంబాలు అనుభవించే బాధ చెప్పలేనిది.. సినిమా అంటే మనకు వాళ్ళ రూపం మాత్రమే, కాని సినిమా అంటే వాళ్లకు జీవితం, కెమెరా ముందుకు అడుగు పెట్టడం ఎంత కష్టమో ఆ కెమెరా నుంచి పక్కకు రావడం నరకం.. అందుకే సినిమా వాళ్ళు దానికి బానిసలుగా బతుకుతారు.
డబ్బు, వాళ్ళ విలాసవంతమైన జీవితాలే మన కళ్ళ ముందు కనపడతాయి. సోషల్ మీడియాలో లైక్ లు, షేర్ లు, వ్యూస్ మాత్రమే మనం చూస్తాం.. శరీరాన్ని అందంగా మార్చాలి అంటే, శరీరం షేప్ మారకూడదు అంటే, ముఖం అందంగా ఉండాలి అంటే, మాట బాగా రావాలంటే, ఒక డైలాగ్ బాగా చెప్పాలి అంటే, అభిమానులకు నచ్చేలా డాన్స్ చెయ్యాలి అంటే, నిర్మాతలకు కాసుల పంట పండాలి అంటే.. ఆ కష్టం ఎవడికీ తెలీదు. అందుకే ఆ బాధ తట్టుకోలేక చాలా మంది డ్రగ్స్ బారిన పడిపోతారు.
Read Also: షాకింగ్ : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
నా డిగ్రీలో అనుకుంట జిమ్ చేస్తూ ఒక నటుడు చచ్చిపోయాడు అంటే నేను వెటకారంగా తిట్టాను. ఆ తర్వాత మహేష్ బాబు సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుంటే ముఖం మారిపోయింది అంటే ఎందుకు నీకు ఇదంతా అనుకున్నాను. కాని వాళ్లను మనం ఆదరించాలి అంటే వాళ్ళు అలాగే ఉండాలి. సినిమా ఫ్లాప్ అయితే కోట్లు పెట్టిన నిర్మాత ముందు హీరోనే బ్లేం చేస్తాడు, డైరెక్టర్ కూడా అంతే. సినిమాలో నటించే టైం లో ఒక సీన్ సరిగా రాకపోతే వందల షాట్ లు చెయ్యాలి, డాన్స్ బాగా లేదు అంటే అభిమానులు ఎన్నో కామెంట్ లు..
సినిమా రివ్యూలో పొగడాలి అంటే ఒళ్ళు మర్చిపోయే విధంగా సినిమాకు కష్టపడాలి. జీవితంలో సగం నటనే ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా నటన గానే చూస్తాం. ముఖం అందంగా కనపడాలి అంటే సర్జరీలు చేయించుకోవాలి, బాడీ అందంగా రావాలి అంటే ఆపరేషన్ లు చేయించుకోవాలి. ఆర్తి అగర్వాల్ అందుకే కదా చచ్చిపోయింది. హీరోగా వరుసగా ఫ్లాప్ లు వస్తే నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాలి, కెరీర్ లో హిట్స్ లేవు అనే కదా ఉదయ్ కిరణ్ ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోయాడు. జగపతి బాబు ఎన్నో ఏళ్ళు తనలో తాను కుమిలిపోయాడు.
వరుసగా మూడు ఫ్లాప్ లు వస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయిపోవాలీ అనుకున్నాడు. గత పదేళ్ళలో ఉదయ్ కిరణ్, శ్రీహరి, హేమంత్ అనే కన్నడ నటుడు, ఆ తర్వాత చిరంజీవి సార్జా, సుశాంత్ సింగ్ ఇలా ఎందరో నటులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. హీరోయిన్ లు కొంత మంది, హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్దార్ధ్ శుక్లా కూడా. వీళ్ళు అందరూ సినిమా ప్రపంచంలో మనకు వినోదం ఇస్తూ నరకం చూసిన వాళ్ళే. ఫ్యామిలీ కి ఆస్తులు ఇస్తారు గాని అందమైన జీవితం కోల్పోతారు. సూపర్ స్టార్ అవ్వడం ఎంత కష్టమో ఆ ఇమేజ్ ని కాపాడుకోవడం అంతకు వెయ్యి రెట్లు కష్టం.
Read Also: Puneeth Rajkumar No More – షాకింగ్ : కన్నడ పవర్ స్టార్ ఇక లేరు
నిన్న పునీత్ రాజ్ కుమార్ మరణం నేను మర్చిపోలేను. బెంగళూరు వెళ్ళినప్పుడు అతని పోస్టర్ లు చూస్తే మైండ్ పోయింది. అతని క్రేజ్ ఆషామాషీ కాదు.. అలా శవంగా పడిపోయిన ఫోటో చూస్తే కంట్లో నీళ్ళు తిరిగాయి. మనకు వినోదం ఇవ్వడానికి వాళ్ళు జీవితాలు త్యాగం చేస్తున్నారు. ఇందులో తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండవచ్చు, కాని ఏ సినిమా వాడి జీవితం కూడా ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండదు ఉండబోదు. అది అమితాబ్ అయినా జబర్దస్త్ యాక్టర్ అయినా సరే. మేకప్ లు వేసుకుని కిడ్నీ సమస్యలతో పదుల మంది నటులు చచ్చిపోయారు.
45 ఏళ్ళ జీవితం ఒక జీవితమా..? ఏం బతికాడు అతను..? వంద మందితో పడుకుంటే హీరో సుఖంగా ఉన్నట్టా..? మనకు వినోదం అందించడానికి మైకేల్ జాక్సన్ ఎంత కష్టపడ్డాడు. తన రూపం మార్చుకోవడానికి రామ్ చరణ్, తన బాడీలో మార్పులు చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎందరో నటుల కష్టాలు తెలియకుండా పొట్టేళ్ళు కోస్తాం, పూలు జల్లుతాం. కూలికి వెళ్ళే వాళ్ళను చూడండి… డబ్బు లేకపోయినా పెళ్ళాం బిడ్డలతో హాయిగా బతుకుతాడు. వంద రూపాయల్లో ఉన్న అందం వంద కొట్లలో ఎప్పటికీ దొరకదు. చివరిగా సినిమా వాళ్లకు చెప్పేది ఒక్కటే, డబ్బు సంపాదన కోసం,ప్రేక్షకుల కోసమే బ్రతకొద్దు సామీ , మీకోసం మీ జీవితం కోసం కూడా కాస్త పట్టించుకోండి..