నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు!

నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైనశైలిలో పరిపాలనలో దూసుకెళ్తున్నారు. అలానే విదేశాల్లో ఉండే తెలువారు గర్వించేలా తన పరిపాలన సాగిస్తున్నారు. సీఎం పలు సందర్భాల్లో తెలుగు ఎన్నారైలపై ప్రశంస వర్షం కురింపించారు. వారు రాష్ట్రానికి, దేశానికి చేస్తున్న కృషిపై అభినందించారు. తాజాగా అమెరికాలోని డాల్లస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్‌ వీడియో ద్వారా తన సందేశం ఇచ్చారు. ఈ సందేశంలో ఎన్నారైలపై మరోసారి ప్రశంస వర్షం కురిపించారు.

అమెరికాలోని డాల్లస్‌లో నాటా తెలుగు మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ సభను ఉద్దేశిస్తూ సీఎం కీలక సందేశం  ఇచ్చారు. ఆ  సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. “2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్‌తో పాటు అందరికీ బెస్ట్ విషెష్. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్‌ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను” అని సీఎం తెలిపారు.

విదేశాల్లో ఉన్నా ఇంత మంది తెలుగువారు.. ఎంతో గొప్పదైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మీరు అక్కడ పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలుగా, సాంకేతిక నిపుణులుగా, నాసా వంటి సంస్ధల్లో కూడా శాస్త్రవేత్తలుగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి వైద్యులుగా రాణిస్తున్నమిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నామని సీఎం తెలిపారు.

అలానే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, విప్లవాత్మక మార్పులు గురించి నాటా తెలుగు మహాసభలో సీఎం వివరించారు. అలానే పశ్చిమ దేశాల్లో స్థిర పడిన తెలుగువారందరికి ఉన్న అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా ఏపీ మీద, మన గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయని తన తరుపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తిని సీఎం జగన్  తన సందేశాన్ని వినిపించారు. మరి.. సీఎం జగన్ సందేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments