బిజేపికి షాకిచ్చిన ఎంపీ, రైతు ఉద్యమానికి సపోర్ట్…!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిన పైకి కనపడకుండా ఇంకా ఉద్యమం నడుస్తూనే ఉంది. మీడియా హడావుడి చేయకపోవచ్చు గాని రైతు నేత రాకేశ్ తియాకత్ మాత్రం ఈ ఉద్యమం విషయంలో తగ్గడం లేదనేది అర్ధమవుతుంది. ఉద్యమం విషయంలో కేంద్ర ప్రభుత్వం లెక్కలేని ధోరణి అనుసరిస్తూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే వ్యవసాయ శాఖా మంత్రి కనీసం రైతుల విషయంలో సానుకూల ధోరణితో లేకపోవడం మరొకటి మైనస్ అయింది. ఇక బిజెపి సోషల్ మీడియా కూడా కాస్త నోటి దూల ప్రదర్శించింది అనే ఆరోపణ కూడా ఉంది.

అయితే ఇప్పుడు పరిస్థితిని అర్ధం చేసుకున్నారో ఏమో గాని బిజెపి నేతలు కొందరు కాస్త ఈ ఉద్యమం విషయంలో ఆలోచనలో పడ్డారనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ బిజెపి నేత ఒకరు రైతు ఉద్యమం విషయంలో తొందరపాటు వద్దని, జాగ్రత్తగా సానుకూల ధోరణి తో ముందుకు వెళ్లి రైతుల అనుమానాలను తొలగించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చని చెప్పినట్టుగా తెలిసింది. ఇక ఇప్పుడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆదివారం ఈ వ్యవసాయ చట్టాలకు సంబంధించి కీలక ప్రకటన చేసారు.

రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని కేంద్రానికి హితవు పలికారు. అలాగే కీలకమైన కిసాన్ పంచాయత్‌లను సమర్ధిస్తూ తన అభిప్రాయం చెప్పారు. ఏ మాత్రం మొండిపట్టుదల లేకుండా కేంద్రం రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘లక్షలాది మంది రైతులు ముజఫర్‌ నగర్‌ లో నిరసనలకు నేడు సమావేశం నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. అలాగే… రైతులు మన సొంత మనుషులన్నారు ఆయన.

వారితో కేంద్ర సర్కార్ గౌరవప్రదంగా మరోసారి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రధానంగా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారితో కలిసి ఒక పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతగా ఉన్న రాకేష్ టికాయత్ ముజఫర్‌ నగర్‌ లో కీలక ప్రకటన చేసారు. కేంద్రం వెనక్కు తగ్గే వరకు కచ్చితంగా రైతు ఉద్యమం ముందుకు వెళ్తుంది అన్నారు.

Also Read : ఒక్క మాట.. ఎంత పని చేసింది చింతమనేని..!?

Show comments