Actress Hema: రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

బెంగుళూరులో నిర్వహించిన రేవ్‌పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు.. వీరిలో నటి హేమతో పాటు చాలా మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు.. బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది అన్నారు. ఈ క్రమంలో కేసులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా నటి హేమకు నోటీసులు జారీ చేశారు. ముందుగా చెప్పిన సమయానికి తాను విచారణకు రాలేనని హేమ తెలిపింది. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నాను అన్నది. ఆ తర్వాత విచారణకు హజరైన సంగతి తెలిసిందే. ఇక హేమ రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

రేవ్‌ పార్టీ కేసులో బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఇ​క ఈ కేసులో తాజాగా కీల పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హేమ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఆమె వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు లేవని.. పైగా ఆమెపకై ఆరోపణలు వచ్చిన పది రో జులకు వైద్య పరీక్షలు నిర్వహించారని కోర్టులో వాదన వినిపించాడు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీ ఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని తెలిసి.. పోలీసులు దాడి చేసిన సమయంలో నటి హేమ కూడా పట్టుబడింది. అయితే ఈ వార్త బయటకు రాగానే, హేమ అదే ఫామ్‌హౌస్ నుండి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసి.. అడ్డంగా బుక్కయ్యింది. అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు స్పష్టం చేశారు. దాంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు. విచారణ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఇదే కేసులో హేమకు బెయిల్ లభించడంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది.

Show comments