iDreamPost
iDreamPost
ఇది నిజంగా విషాదం. అమెరికాలో ఒక కంటైనర్ ట్రక్కులో 46 వలసదారుల మృత దేహాలు. వీళ్లంతా మెక్సికో సరిహద్ధు దాటి అమెరికాలో బంగారు భవిష్యత్తును కోరుకున్నవాళ్లే. టెక్సస్ లోని, శాన్ ఆంటోనియోలో ఊరుబైట ఈ ట్రక్కును వదిలేశారు. సాయం చేయమని అరుపులు వినిపిస్తుంటే, దగ్గర్లోని పని చేస్తున్న కార్మికులు కంటైనర్ తలుపులు బలవంతంగా తెరిచిచూశారు. వాళ్లకు భారీగా మృత దేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కంటైనర్ నిండా శవాలు, వాళ్ల మధ్య చావుబతుకుల్లో 16 మంది సజీవంగా కనిపించారు. వీరిలో నలుగురు పిల్లలుకూడా ఉన్నారు. వారిని హాస్పటల్ కి తీసుకెళ్లారు.
అమెరికా-మెక్సికో సరిహద్దుల వెంట ఇంతమంది వలసదారులు ఇటీవలకాలంలో ప్రాణాలు కోల్పోలేదు.
అమెరికా-మెక్సికో సరిహద్దుకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్ దొరికింది. మెక్సికో నుంచి అక్రమంగా వలసదారులను ఈ మార్గంలో ముఠాలు తరలిస్తుంటాయని పోలీసులు అంటున్నారు. ఈ రూట్ లో పోలీసుల పహారాకూడా ఎక్కువే.
ఇప్పుడు అమెరికాలో ఎండలు ఎక్కువ. 40 డిగ్రీలు వరకు ఉష్టోగ్రత నమోదువుతోంది. ఇంత వేడిలో కంటైనర్ లో కిటికీలు లేవు. లోపలున్న ఏసీ పనిచేయలేదు.తాగడానికి నీళ్లు లేవు. డీ హైడ్రేషన్. ఎక్కడైనా ఆపితే పోలీసులు పట్టుకొంటారన్న భయం. అందుకు ముఠా వాళ్లు ఆపమని ఆరుస్తున్నా, పట్టించుకోకుండా తీసుకొచ్చారు. ఎక్కువమంది చనిపోయారని తెలియగానే రోడ్డపక్కన కంటైనర్ ను వదిలేశారన్నది పోలీసుల అంచనా.
వలసదారులతో అమెరికాలోకి అక్రమంగా వచ్చే పెద్దపెద్ద కంటైనర్ ట్రక్కులు రూరల్ రూట్లను ఎంచుకొంటాయి. హైవేలైతే పోలీసులు పట్టుకొంటారన్న భయం.